top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ మదగ్ని మహాపురాణము - 122 / Agni Maha Purana - 122


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 122 / Agni Maha Purana - 122 🌹


✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ


శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.


ప్రథమ సంపుటము, అధ్యాయము - 38


🌻. దేవాలయ నిర్మాణ ఫలము - 5🌻


యమధర్మరాజు చెప్పెను: "దేవ ప్రతిమా నిర్మాణముచేసినవారిని, దానికి పూజలు సలిపిని వారిని మీరు నరకమునకు తీసికొనిరాకూడదు. దేవాలయాదులను నిర్మింపనివారిని మాత్రమే తీసికొనిరావలెను. మీరందరు లోకములో సంచరించుచు నా ఆజ్ఞను పాలింపుడు. ప్రపంచమునందలి ఏ ప్రాణియు మీ ఆజ్ఞను ధిక్కరింపజాలడు. జగత్పిత యైన ఆనంతుని శరణుజొచ్చినవారిని మాత్రము మీరు విడచివేయవలెను. వారి కీ లోకములో నివాసము ఉండదు.


భగవంతునిపై చిత్తము లగ్నము చేసి, భగవంతుని శరణుజొచ్చినభగవద్భక్తు లగు మహాత్ములను, సదా విష్ణుపూజ చేయువారిని మీరు విడిచివేయవలెమ. నిలచినపుడు గాని, నిద్రించినపుడు గాని, నడచునపుడు గాని, అన్ని వేళలందును శ్రీకృష్ణనామస్మరణము చేయువారి దరికి పోవలదు. నిత్యనైమిత్తికకర్మల ద్వారా జనార్దనుని పూజ చేయువారి వైపు కన్నెత్తి యైనను చూడవలదు. అట్టి భగవద్వ్రతశీలులు భగవంతునే చేరుదురు.


పుష్పములు, ధూపము, వస్త్రములు మొదలగు అలంకారములను సమర్పించి భగవంతుని పూజ చేయువారి జాడలకు పోవలదు. వారు శ్రీకృష్ణుని చేరినవారు. దేవాలయములందు ఆలికి ముగ్గులు వేయువారి పుత్రులను, వంశీయులకను కూడ విడిచివేయవలెను. విష్ణ్వాలయమును నిర్మించినవారి వంశములో నూరు తరములవరకును మీరెవ్వరిని దుష్టభావముతో చూడరూదు. కఱ్ఱతో గాని, మట్టితో గాని, ఱాతితో గానీ విష్ణువులనకు ఆలయము కట్టించినవాడు సమస్తపాపనిర్ముక్తుడగును.



సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Agni Maha Purana - 122 🌹


✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj


Chapter 38


🌻 Benefits of constructing temples - 5 🌻


Yama said:


“Those men who build temples of gods and adore the idols are not to be brought to hell.


36. Bring them to my view who have not built temples and other things. Move around in the befitting way and execute my directive.


37. Except those who have resorted to Ananta, the father of the universe, no other beings would at any time disregard the command.


38. Those who are devotees of Viṣṇu and have their mind fixed on him have to be avoided by you. They are not to live here.


39-49. Those who always adore Viṣṇu should be avoided by you from a distance. Those who sing the glories of Govinda while standing or sleeping or walking or standing behind or stumbling or remaining (at a place) are to be avoided by you from a distance


Those who worship Janārdana with obligatory and occasional rites are not to be beheld by you. Those who follow this course attain good position. Those who worship (the god) with flowers, incense, raiments, favourite ornaments, (and) those who have gone to the abode of Kṣṣṇa are not to be seized by you.


Those who besmear with unguents, and those who are engaged in sprinkling his body, their children and their descendants should be left in the temple of Kṛṣṇa. Hundreds of men born in the family of one who has built the temple of Viṣṇu should not be seen by you with evil mind. Whoever builds a temple of Viṣṇu with wood or stone or earth gets free from all sins.



Continues....


🌹 🌹 🌹 🌹 🌹

Comments


Post: Blog2 Post
bottom of page