top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ మదగ్ని మహాపురాణము - 123 / Agni Maha Purana - 123


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 123 / Agni Maha Purana - 123 🌹


✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ


శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.


ప్రథమ సంపుటము, అధ్యాయము - 38


🌻. దేవాలయ నిర్మాణ ఫలము - 6🌻


ప్రతిదినము యజ్ఞములు చేసి భగవదారాధన చేయువానికి లభించు ఫలమే విష్ణ్వాలయము నిర్మించినవానికి గూడ కలుగును. విష్ణ్వాలయము కట్టించినవాడు తన వంశము నందలి వెనుకటి నూరుగురిని, రాబోవు నూరుగురిని విష్ణలోకమునకు పంపును మహావిష్ణువు సప్తలోకమయుడు. అట్టి విష్ణుమూర్తికి ఆలయము కట్టించువాడు తన వంశమును తరింపచేయును.


తన వంశీయులకు అక్షయపుణ్యలోక ప్రాప్తి కలుగు నట్లు చేయును. తాను కూడ అక్షయలోకములను పొందును. దేవాలయములోని ఇటుకల కట్టుబడి ఎన్ని సంవత్సరము లుండునో అన్ని వేల సంవత్సరములపాటు ఆ దేవాలయ నిర్మాత స్వర్గలోకములో నుండును. భగవత్ప్రతిమ నిర్మించినవాడు విష్ణులోకము చేరును. దానిని స్థాపించినవాడు భగవంతునిలో లీన మగును. దేవాలయము నిర్మించు దానిలో ప్రతిమాస్థాపన చేసినవాడు సర్వదా విష్ణులోకములో నివసించును."


అగ్నిదేవుడు పలికెను.:


యమధర్మరాజు ఇచ్చిన ఈ ఆజ్ఞ ప్రకారము, యమదూతలు విష్ణస్థాపనాదిపుణ్యకార్యములు చేసినవారిని యమలోకమునకు తీసికొవివెళ్ళరు. దేవాలయాదిప్రతిష్ఠాదివిధానమును గూర్చి హయగ్రీవుడు బ్రహ్మతో విర్ణించి చప్పెను.


అగ్ని మహాపురాణము నందలి దేవాలయనిర్మాణమాహాత్మ్యదివర్ణన మను ముప్పదియెనిమిదవ అధ్యాయము సమాప్తము.



సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Agni Maha Purana - 123 🌹


✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj


Chapter 38


🌻 Benefits of constructing temples - 6 🌻


One who builds the temple of Viṣṇu gets that great benefit which (one would acquire) by doing sacrificial rites everyday. By building a temple for Viṣṇu (one) conveys hundreds of his discendants and hundreds of his ancestors to the world of Acyuta.


Viṣṇu is identical with the seven worlds. One who builds a house for him saves the endless worlds and also obtains endlessness. One who builds (a temple) for him, lives for so many years in heaven as the number of years the set up bricks would remain. The maker of the idol (would reach) the world of Viṣṇu. One who consecrates it would get absorbed in Hari.


One who builds a temple, makes an idol and installs it goes within his range.


Agni said:


“I have not brought one who has installed Hari as told by Yama”. Hayaśiras told Brahmā for the installation of gods.



Continues....


🌹 🌹 🌹 🌹 🌹

Commentaires


Post: Blog2 Post
bottom of page