🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 137 / Agni Maha Purana - 137 🌹
✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ
శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.
ప్రథమ సంపుటము, అధ్యాయము - 42
🌻. ఆలయ ప్రాసాద నిర్మాణము - 3🌻
ద్వారము నాల్గవ భాగమున చందుడు, ప్రచండుడు, విష్వక్సేనుడు, వత్సదండుడు అను నాలుగు ద్వార పాలకుల మూర్తులను నిర్మింపవలెను | ఉందుంబర శాఖ సగభాగమున సుందరమగు లక్ష్మీవిగ్రహము నిర్మింపవలెను. ఆమె చేతిలో కమలముండవలెను. దిగ్గజములు కలశములతో ఆమెను స్నానము చేయించు చుండవలెను. ప్రాకారము ఎత్తు ఆలయము ఎత్తులో నాల్గవవంతు ఉంచవలెను. ఆలయ గోపురముఎత్తు ఆలయము ఎత్తకంటె నాల్గవవంతు తక్కువ ఉండవలెను. దేవతా విగ్రహము ఐదు హస్తముల విగ్రహమైన చోదాని పీఠిక ఒక హస్తముండవలెను.
విష్ణ్వాలయము ఎదుట ఒక గరుడ మండపము, భౌమాది ధామములను నిర్మింపవలెను. మహావిష్ణువు విగ్రహామునకు చుట్టు, ఎనిమిదివైపులందును విష్ణుప్రతిమకంటె రెట్టింపు ప్రమాణముగల అవతారమూర్తులను నిర్మింపలెను. తూర్పున వరాహాము, దక్షిణమున నృసింహమూర్తి, పశ్చిమమున శ్రీధరుడు, ఉత్తరమున హయగ్రీవుడు, ఆగ్నేయమున పరశురాముడు, నైరృతి దిక్కునందు శ్రీరాముడు, వాయవ్యమున వామనుడు, ఈశానమున వానుదేవుడు-వీరిమూర్తులను నిర్మింపవలెను. ఆలయ నిర్మాణమును ఎనిమిది, పండ్రెండు మొదలగు సరిసంఖ్యల స్తంభములతో చేయవలెను. ద్వారము అష్టమాద్యంశలు తప్ప కలుగు వేధచేదోష మేమియును ఉండదు.
అగ్ని మహాపురాణమునందు ఆలయ ప్రాసాద నిర్మాణమును నలుబదిరెండవ అధ్యాయము సమాప్తము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana - 137 🌹
✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj
Chapter 42
🌻 Construction of a temple - 3 🌻
20-21. (Forms of) Caṇḍa and Pracaṇḍa should be carved on the door-frame occupying a fourth (of its space), (possessing) a staff like that of Viṣvaksena (Viṣṇu) and at the threshhold of the branch beautiful (Goddess) Śrī (Lakṣmī) (should be carved) as being bathed by the elephants of the quarters with (waters from) the pitchers. The height of enclosing wall should be onefourth of that of the temple.
22. The height of the tower should be a quarter lesser than that of the temple. The pedestal (of the image) of the deity of five cubits should be of a cubit.
23. A shed known as the Garuḍamaṇḍapa and shed for Bhauma (Mars) and other (planets) (should be made). In the eight directions above (the chamber housing) one should make (the images as follows):
24-25. (The images of) Varāha (boar) in the east, Nṛsiṃha (man-lion) in the south, Śrīdhara (a form of Viṣṇu) in the west, Hayagrīva (horse-necked form of Viṣṇu) in the north, Jāmadagnyaka (Paraśurāma, a manifestation of Viṣṇu) in the south-east, Rāma in the south-west, Vāmana (the short-statured manifestation ofViṣṇu) in the north-west (and) Vāsudeva in the north-east. The temple should be decorated with gems all around. Leaving out one-eighth of the door if that is done, it is not defective.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
Commentaires