🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 144 / Agni Maha Purana - 144 🌹
✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ
శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.
ప్రథమ సంపుటము, అధ్యాయము - 44
🌻. వాసుదేవ ప్రతిమా లక్షణము - 3🌻
గంధ పాత్రము, ఆ వర్తము, శష్కులి (చెవి రంధ్రము) కూడ నిర్మింపవలను. క్రింది పెదవి ఒక అంగులము, పైపెదవి అర అంగుళము ఉండవలెను. నేత్రవిస్తారము అర అంగుళము, ముఖ విస్తారము నాలుగు అంగుళములు ముఖము వెడల్పు ఒకటిన్నర అంగుళములు ఉండవలెను. ముక్కు ఎత్తు ఒక అంగుళము పొడవు రెండు అంగుళములు ఉండవలెను. దాని అకారము కరవీర కుసుమము వలె ఉండవలెను. రెండు నేత్రముల మధ్య నాలుగు అంగుళముల అవకాశముండ వలెను. రెండు అంగుళములు నేత్రముల పరిధిలోనికి రాగా ఇంక రెండు అంగుళముల వ్యవధానముండును.
నేత్రములోని మూడవ వంతు నల్లగ్రుడ్లు, ఐదవవంతు చిన్న నల్లగ్రుడ్డు ఉండవలెను. నేత్ర విస్తారము రెండు అంగుళములు, ద్రోణి అర అంగుళము ఉండవలెను. కను బొమ్మల రేఖల ప్రమాణము కూడ అంతే ఉండవలెను. రెండు కను బొమ్మలును ఒకే ప్రమాణములో ఉండవలెను. కనుబొమ్మల మధ్య రెండు అంగుళములు విస్తారము నాలుగు అంగుళములు ఉండవలెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana - 144 🌹
✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj
Chapter 44
🌻Characteristics of the image of Vāsudeva - 3 🌻
17. Then the external auditory passage with its membranes etc. should be made. The lower lip should be of two aṅgulas and the upper lip should be half of it.
18. Then the (breadth) of an eye (should be) half an aṅgula and the mouth (should be) four aṅgulas. The measurement of its depth is spoken to be one and a half aṅgulas.
19-20. The unopened mouth should be in this way. The opened mouth should be three aṅgulas. The base of the bridge of the nose should be one aṅgula high. From its tip it should be two aṅgulas similar to the karavīra (flower) (oleander). The intervening space between the two eyes should be made to measure four aṅgulas.
21. The corners of the eyes (should be) two aṅgulas. The space between them (should be) two aṅgulas. The pupil (should be) one third of the eye and the iris (should be) one fifth (of it).
22. The breadth of the eye (should be) three aṅgulas. The cavity (of the eye) is considered to be half an aṅgula. The lengths of the eyebrows are considered to be equal and are proportional to the eye-brows.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
Comments