🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 151 / Agni Maha Purana - 151 🌹
✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ
శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.
ప్రథమ సంపుటము, అధ్యాయము - 46
🌻. శాలగ్రామాది మూర్తి వర్ణనము - 2🌻
మూడు బిందువులతో, కంచు వలె తెల్లగానుండు, పెద్ద ఆకారము గల శాలగ్రామము మత్స్యము.
వనమాల, ఐదురేఖలు గల గోలాకారమైన శాలగ్రామము శ్రీధరుడు.
చాల చిన్నదై , బిందువులుండి, గోలాకారమైన నీల శాలగ్రామము వామనము.
కుడి ప్రక్క హార రేఖయు, ఎడమ ప్రక్క బిందువులు, ఉన్న శ్యామ వర్ణమగు శాలగ్రామము త్రివిక్రముడు.
సర్ప శరీర చిహ్నము, అనేక మూర్తులు ఉండి, చాలరంగులతో ప్రకాశించు శాలగ్రామము అనంతుడు-అదిశేషుడు.
మధ్యభాగమున చక్రము, క్రింద సూక్ష్మబిందువు ఉన్న స్థూలమగు శాలగ్రామము దామోదరుడు.
ఒక చక్రమున్న శాలగ్రామము సుదర్శనము.
రెండు చక్రములున్నది లక్ష్మీనారాయణుడు.
మూడు చక్రములున్నది అచ్యుతుడు, లేదా త్రివిక్రముడు.
నాలుగు చక్రములున్నది జనార్దనుడు.
ఐదు చక్రములున్నది వాసుదేవుడు.
ఆరు చక్రములున్నది ప్రద్యమ్నుడు,
ఏడు చక్రములున్నది సంకర్షణుడు
ఎనిమిది చక్రములున్నది పురుషోత్తముడు.
తొమ్మిద చక్రములున్నది నవవ్యూహము.
పది చక్రములున్నది దశావతారమూర్తి.
పదకొండు చక్రములున్నది అనిరుద్ధుడు.
పండ్రెండు చక్రములున్నది ద్వాదశాత్మ.
అంతకంటె అధిక చక్రములున్నది అనంతుడు.
అగ్నిమహాపురాణము నందు శాలగ్రామ మూర్తి వర్ణనమను నలుబది యారవ అధ్యాయము సంపూర్ణము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana - 151 🌹
✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj
Chapter 46
🌻Characteristics of different Śālagrāma stones- 2 🌻
8. The Matsya stone is long and has three dots. It is crystalline-coloured and is well formed. The Srīdhara (stone) has a garland of wild flowers and five lines and is circular.
9. The Vāmana (stone) is circular and is very short. It is. blue (coloured) and has a dot. The Trivikrama (stone) is black (coloured). It has a line on the right and a dot on the left side.
10. The Ananta (stone) has the mark of the hood of a serpent, it has variegated colours and manifold forms. The Dāmodara (stone) is big and has a disc in the middle part with two minute dots.
11. The Sudarśana (stone) has (the mark of) a disc. The Lakṣmīnārāyaṇa (stone) (is that which has the marks of) two discs. The Acyuta (stone) (has the marks of) three discs. Or the Trivikrama (stone) may have (the marks of) three discs.
12. The Janārdana (stone) has (the marks of) four discs. The Vāsudeva (stone) has (the marks of) five discs. The Pradyumna (stone) has (the marks of) six discs. The Saṅkarṣaṇa. (stone) has (the marks of) seven discs.
13. The Puruṣottama (stone) has (the marks) of eight discs. The Navavyūha form has the marks of nine discs. (The stone representing) the ten manifestations (of Viṣṇu) (is marked) with ten (discs). The Aniruddha form (is marked) with eleven (discs). The Dvādaśātman (class of śālagrāma) (is marked) by twelve (discs). (One is deemed to be) the Ananta (class of śālagrāma) (if it has) more (discs) than these.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
Commentaires