top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ మదగ్ని మహాపురాణము - 152 / Agni Maha Purana - 152


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 152 / Agni Maha Purana - 152 🌹


✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ


శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.


ప్రథమ సంపుటము, అధ్యాయము - 47


🌻. శాలగ్రామ పూజా విధానము - 1🌻


హయగ్రీవుడు చెప్పెను:


ఇపుడు చక్రాంకిత శాలగ్రామముల పూజావిధానమును చెప్పచున్నాను. ఇది సిద్ధిప్రదమైనది. శ్రీహరి పూజ కామ్య, అకామ్య, కామ్యాకమ్య అని మూడు విధములు. మత్స్యాది పంచ విగ్రహముల పూజ కామ్యముగాని, ఉభయాత్మికగాని కావచ్చును. వెనుక చెప్పిన చక్రములతో ప్రకాశించు వారాహ-వామన-నృసింహుల పూజను ముక్తికొరకు చేయవలెను, ఇపుడు మూడు విధములైన శాలగ్రామ పూజను గూర్చి వినుము.


వీటిలో నిష్పల పూజ ఉత్తమము: సఫలపూజ కనిష్ఠము; మూర్తిపూజ మద్యమము, చతురస్ర మండపముపైనున్న కమలమునందు పూజా విధి ఈ విధముగ ఉండును-


హృదయమునందు ప్రణవన్యాసము చేయుచు షడంగన్యాసము చేయవలెను. పిమ్మట కరన్యాసము, వ్యాపకాన్యసము చేసి మూడు ముద్రలను చూపవలెను పిమ్మట చక్రమునకు బైట, తూర్పున గురువును పూజించవలెను. పశ్చిమమున గణమును, వాయవ్యమున ధాతను, నైరృతి యందు విధాతను పూజింపవలెను. దక్షిణోత్తరములయందు వరుసగా కర్తను, హర్తను పూజింపవలెను. ఈశాన్యమున విష్వక్సేనుని, అగ్నేయమున క్షేత్రపాలుని పూజింపవలెను.



సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Agni Maha Purana - 152 🌹


✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj


Chapter 47


🌻Mode of worshipping Śālagrāma - 1 🌻


The Lord said:


1. I shall describe the mode of worshipping the śālagrāma marked with discs for (the sake of) accomplishment. The worship of Hari (in the śālagrāma) is of three kinds—


(i) kāmyā performed for gaining particular benefit


(ii) akāmyā performed with disinterestedness about the benefits


(iii) śubhayātmikā, that is of the nature of both of them.


2. (The worship) of the five (manifestations of Viṣṇu) (such as) the Fish[1] etc., is, either kāmyā or ubhayātmikā (The worship of the manifestations) of the Boar Man-lion and Dwarf forms (of Viṣṇu is) for emancipation.


3-6. Listen to the three-fold worship of the śālagrāma endowed with discs. The excellent worship is that performed without desiring for the fruits. The worship with desire for the fruits is the last (in the rank). The worship of an image is mediocre.


In a circular lotus placed on a rectaṅgular seat, having assigned the praṇava (the syllable Oṃ) to the heart and having assigned (the sacred syllables) to the parts of the body and having shown three mudrās (positions of fingers in the practice of worship), the preceptor should be worshipped outside the circle.


The attendant gods (gaṇas) should be worshipped on the west. Dhātṛ on the north-west, Vidhātṛ on the south-west, the Kartā and Hartā on the south and north, Viṣvaksena (Viṣṇu)should be worshipped in the north-east, and Kṣetrapālaka (the guardian deity) on the south-east.



Continues....


🌹 🌹 🌹 🌹 🌹

Comentarios


Post: Blog2 Post
bottom of page