top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ మదగ్ని మహాపురాణము - 155 / Agni Maha Purana - 155


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 155 / Agni Maha Purana - 155 🌹


✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ


శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.


ప్రథమ సంపుటము, అధ్యాయము - 48


🌻. చతుర్వింశతి మూర్తి స్తోత్రము - 2🌻


యుద్ధ కుశలుడైన ప్రద్యుమ్నుడు చక్ర-శంఖ-గదా-పద్మములను ధరించును. అనిరుద్ధుడు చక్రగదా శంఖపద్మములను అతుడు మనలను రక్షించుగాక. సురేశ్వరుడైన పురుషోత్తముడు చక్ర-కమల-శంఖ-గదలను ధరించును. అధోక్షజుడు పద్మ-గదా-శంఖ-చక్రములను ధరించును. అతడు ఘమ్ములను రక్షించుగాక. నృసింహుడు చక్ర- పద్మ - గదా - శంఖములను ధరించును. నేను అతనికి నమస్కరించుచున్నాను.


గదా-పద్మ-చక్ర-శంఖములను ధరించు అచ్యుతుడు మిమ్ములను రక్షించుగాక. శంఖ-గదా-చక్ర-పద్మములను ధరించు, బాలవటుడైన వామనుడు, పద్మ-చక్ర-శంఖ-గదలను ధరించు జనార్దనుడు, శంఖ-గదా-చక్ర-గదలను ధరించు, యజ్ఞస్వరూపుడైన శ్రీహరి, శంఖ-గదా-పద్మ-చక్రములను ధరించు కృష్ణుడు నాకు భోగములను, మోక్షమును ప్రసాదించుగాక.


వాసుదేవుడు ఆదిమూర్తి. వాసుదేవుని నుండి సంకర్షణుడు ఆవిర్భవించెను. సంకర్షణుని నుంéడి ప్రద్యుమ్నడు, ప్రద్యుమ్నుని నుండి అనిరుద్ధుడు ఆవిర్భవించెను. వీరిలో ఒక్కరొక్కరు క్రమముగ కేశవాదిమూర్తి భేదమున మూడేసి రూపములలో ఆవిర్భవించిరి. (అనగా వాసుదేవుని నండి కేశవ - నారాయణ - మాధవమూర్తులు, సంకర్షణుని నుండి గోవింద- విష్ణు - మధుసూదనమూర్తులు, ప్రద్యుమ్నుని నుండి త్రివిక్రమ - వామన - శ్రీధరమూర్తులు, అనిరుద్ధుని నుండి హృషీకేశ - పద్మనాభ - దామోదరమూర్తులు ఆవిర్భవించినవి). ఇరువది నాలుగు మూర్తుల స్తోత్రముతో కూడిన ఈ ద్వాదశాక్షర స్తోత్రమును చదువువారును. వినువారును నిర్మలులై, సంపూర్ణ మనోరథములను పొందుదురు.


విశేషాంశము: ఈ స్తోత్రములో ఇరువది నాలుగు మూర్తుల స్వరూపముమ వర్ణించు మొదటి పండ్రెండు శ్లోకములలోని మొదటి అక్షరములను కలిపి చదివినోచో ''ఓం నమో భగవతే వాసుదేవాయ'' అను ద్వానశాక్షరి ఏర్పడును అందుచే దానికి "ద్వాదశాక్షరీ స్తోత్రము" అనియు, "చతుర్వింశతి మూర్తి స్తోత్రము" అనియు పేర్లు.


అగ్ని మహాపురాణము నందు చతుర్వింశతిమూర్తి స్తోత్రమను నలుబది ఎనిమిదివ అధ్యాయము సమాప్తము.


సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Agni Maha Purana - 155 🌹


✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj


Chapter 48


🌻Adoration of twenty-four forms of Viṣṇu - 2 🌻


8. Lord Pradyumna is one who holds a mace, disc, conch and mace as well as a lotus. May Aniruddha, who wields the disc, mace, conch and lotus protect us.


9. May Puruṣottama, the Lord of celestials, who holds disc, lotus, conch and mace (protect you). May Adhokṣaja who wields lotus, mace, conch and disc protect you.


10. I salute that Lord Nṛsiṃha, who wields disc, lotus, mace and conch. May Acyuta, who holds mace, lotus, disc and conch, protect you all.


11. So also (may) Upendra, who is of the form of a child and (who holds) the disc and lotus, (protect you). And (may) Janārdana, who wields lotus, disc, conch and mace (protect you).


12. May Hari, who holds conch, lotus, disc as well as (mace) kaumodakī yield me enjoyment and emancipation. May Kṛṣṇa, who holds conch, mace, lotus and disc give enjoyment and emancipation.


13. The first manifestation was that of Vāsudeva. Then Saṅkarṣaṇa manifested. Pradyumna manifested from Saṅkarṣaṇa. Aniruddha appeared from Pradyumna.


14. Each one of the (above) forms was divided into three forms such as Keśava and others. One who reads or hears this hymn consisting of twelve letters on the twenty-four forms gets free from impurity and gets all things.



Continues....


🌹 🌹 🌹 🌹 🌹

Commenti


Post: Blog2 Post
bottom of page