🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 156 / Agni Maha Purana - 156 🌹
✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ
శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.
ప్రథమ సంపుటము, అధ్యాయము - 49
🌻. మత్స్యాది దశావతార ప్రతిమా లక్షణములు - 1 🌻
హయగ్రీవుడు చెప్పెను: ఇపుడు మత్స్యాది దశావతారములు విగ్రహములను గూర్చి చెప్పెదను. మత్స్యావతార విగ్రహము మత్స్యాకారమునను, కూర్మావతార విగ్రహము కూర్మాకారమునను ఉండవలెను. భూమిని పైకి లేవనెత్తుచున్న వరాహావతార విగ్రహముము మనుష్యాకారమున నిర్మికపవలెను.
కుడిచేతిలో గదా-చక్రములు, ఎడమచేతిలో శంఖపద్మములు ఉండవలెను. లేదా పద్మమునకు బదులు ఎడమ ప్రక్క లక్ష్మీదేవి ఉండవలెను. లక్ష్మి అతని ఎడమమోచేయి అనుకొని ఉండును. పృథివి, అదిశేషుడు చరణములను అనుసరించి ఉండవలెను.
వరాహమూర్తి స్థాపించిన వారికి రాజ్యము లభించును; అంతమును వారు, భవసాగరము దాని మోక్షము పొందుదురు. నృసింహమూర్తి ముఖము తెరచి ఉండును. తన ఎడమ తొడపై హిరణ్యకశిపుని అణచి ఉంచి వాని వక్షమును చీల్చుచుండును. ఆతని కంఠమున మాలయుహస్తములందు చక్ర-గదలును ఉండెను.
వామనుని విగ్రహము ఛత్రముతోడను, దండముతోడను ప్రకాశింపవలెచు. నాలుగు భుజములుండవలెను. పరశురాముని చేతిలో ధనుర్బాణములు, ఖడ్గము, గండ్రగొడ్డలి ఉండవలెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana - 156 🌹
✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj
Chapter 49
🌻Characteristics of forms of ‘Fish’ etc. of Viṣṇu - 1 🌻
The Lord said:
1. I shall describe to you the characteristics of the ten manifestations (of Viṣṇu) beginning with the Fish. The Fish (form of Viṣṇu) should resemble a fish. The Tortoise (form) should resemble a tortoise.
2. The terrestrial boar (manifestation) should have a human body and as carrying a mace and other (weapons) in the right hand, and the conch, (the goddess) Lakṣmī or a lotus in the left.
3. Or (the goddess) (is represented) as resting on the left elbow and the earth and (the serpent) Ananta at the feet. The installation of the figure secures for a person a kingdom and (such a person) gets across the ocean of mundane existence.
4. The Man-lion image (should be represented) as having a wide open mouth and having the killed demon (Hiraṇyakaśipu) on the left thigh. His chest should wear a garland and (his arms) should hold disc and mace.
5. The Dwarf-form may hold an umbrella and a stick or have four arms. The figure of Paraśurāma may hold the bow and arrow, a sword and an axe.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
Comentarii