🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 158 / Agni Maha Purana - 158 🌹
✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ
శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.
ప్రథమ సంపుటము, అధ్యాయము - 49
🌻. మత్స్యాది దశావతార ప్రతిమా లక్షణములు - 3 🌻
ఇపుడు వాసుదేవాదులగు తొమ్మండుగురి మూర్తుల లక్షణము చెప్పెదను. వాసుదేవునకు పై కుడిచేతిలో చక్రముండుచట ప్రధాన చిహ్నము ఒక పార్శ్వమున బ్రహ్మ, మరొక పార్శ్వము శివుడు సర్వదా ఉందురు.
ఇతర విషయములన్నియు వెనుక చెప్పినట్లే, శంఖమునుగాని, వరదముద్రను గాని ధరించి యుండును. ద్విభూజుడు కావచ్చును. చతర్భుజుడు కావచ్చును. బలరామునకు నాలుగు భుజములుండను. కుడిచేతులలో హల-ముసలములను, ఎడమచేతులలో గదా- పద్మములను ధరించి ఉండును.
ప్రద్యుమ్నుడు కుడిచేతులలో చక్ర-శంఖములను, ఎడమ చేతులలో ధనుర్బాణములను ధరించి యుండును. లేదా రెండు భుజములుండి ఒకచేతిలో గధను, రెండవ దానిలో ధనస్సును ధరించి యుండును. ఈ ఆయుధములను ప్రసన్నతా పూర్వకముగ ధరించి యుండును. లేదా ఒక హస్తమున ధనస్సు, రెండవ హస్తమున బాణము ఉండును.
అనిరుద్ధ-నారాయణుల విగ్రహములు చతుర్భుజములు బ్రహ్మహంసారూఢుడు. నాలుగుముఖములు, ఎనిమిది భుజములు, విశాలమైన ఉదరమండలము, పొడవైన గడ్డము, శిరస్సుపై జటలు ఉండును కుడిచేతులలో అక్షసూత్రమును-స్రువమును, ఎడమచేతులలో కుండికను, అజ్యస్థాలిని ధరించి యుండును. ఎడమ ప్రక్క సరస్వతి, కుడిప్రక్క సావిత్రి ఉండును.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana - 158 🌹
✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj
Chapter 49
🌻Characteristics of forms of ‘Fish’ etc. of Viṣṇu - 3 🌻
10. I shall describe the characteristics of nine forms of Viṣṇu commencing with Vāsudeva. The mace (is placed) on the right half (upper arm) and the excellent disc on the left half (upper arm).
11. The image of Vāsudeva may be made as before or as having four hands or two hands, one holding a conch and the other as conferring boons and having Brahmā and Īśa (Śiva) always on either side.
12. (The figure of) Balarāma (is represented) as holding a plough, mace, club and lotus. (The image of) Pradyumna (is represented as having) thunderbolt and conch on the right arm and the bow in the left arm.
13. Or Pradyumna (is represented) as having the mace resting on the navel with pleasure or holding the bow and arrow. Aniruddha may be (represented as) having four arms. In the same way Lord Nārāyaṇa (may also be represented).
14. (The image of) Brahmā is (represented as having) four faces, four hands, big belly, long beards, matted hair, and (having) swan as the vehicle in front (of him).
15. (There should be) a rosary and a ladle on the right hand and a water-pot and vessel to hold the sacrificial clarified butter. Sarasvatī and Sāvitrī (consorts of Brahmā) (should be placed) on the left and right sides.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
Comentarios