🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 161 / Agni Maha Purana - 161 🌹
✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ
శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.
ప్రథమ సంపుటము, అధ్యాయము - 50
🌻. దేవీ ప్రతిమా లక్షణములు - 1 🌻
హయగ్రీవుడు చెప్పెను: చండీదేవికి ఇరువది బుజములుండును. కుడిచేతులలో శూల-ఖడ్గ-శక్తి-చక్ర-పాశ-ఖేట-ఆయుధ, అభయ-డమరు శక్తులను, ఎడమచేతులలో నాగపాశ-ఖేటక-కుఠార-అంకుశ-పాశ-ఘంటా-ఆయుధ-గదా-దర్పణ-ముద్గరములను ధరించియుండును. చండీదేవిప్రతిమకు వదిభుజములుకూడ ఉండవచ్చును. ఆమె పాదములక్రింద తలఖిండించిన మహిషముండును. ఆ తలతెగి వేరుగా ఉండవలెను. దాని కంఠమునుండి శూలము హస్తమునందుగల పురుషుడు శస్త్రమునుఎత్తి మిక్కిలికోపముతో ముఖమునుండి రక్తము కక్కుచుండును. వాని కంఠమునందు మాల, వెండ్రుకలు, ఎఱ్ఱగానుండును, దేవీవాహనమైన సింహము దాని రక్తము నాస్వాదించు చుండును. ఆ మహిషాసురుని కంఠమున పాశమొకటి గట్టిగా బిగించియుండును. దేవి కుడికాలు సింహముపైనను, ఎడమకాలు క్రిందనున్న మహిషాసురుని పైనను ఉండును.
ఈ చండీదేవికి మూడు నేత్రములుండును. ఈమె అనేక శస్త్రములను ధరించి శత్రువులను మర్దించునది. తొమ్మిది పద్మముల రూపమున నున్న పీఠముపై దుర్గాప్రతిమపై ఈమెను పూజింపవలెను. మొదటి కమలము తొమ్మిది దళములందును, మధ్యననున్న కర్ణికయందును ఇంద్రాది దిక్పాలులను, నవతత్త్వాత్మి కలగు శక్తులతో దుర్గాదేవిని పూజింపవలెను. దుర్గాదేవి ప్రతిమకు పదునెనిమిది భుజములుండును. కుడువైపున నున్న హస్తములలో ముండ-ఖేటక-దర్పణ-తర్జనీ-ధనుష్-ధ్వజ-డమరు, చర్మ-పాశములను, వామభాగమున నున్న హస్తములలో శక్తి-ముద్దర-శూల-వజ్ర-ఖడ్గ-కుంకుశ-భాణ-చక్ర-శలాకలను ధరించి యుండును.
పదునారు భుజముల దుర్గాప్రతిమకు కూడ డమరువు, తర్జని తప్ప ఈ ఆయుధములే ఉండును. రుద్రచండ, ప్రచండ, చండోగ్ర, చండనాయిక, చండ, చండవతి, చండరూప, అతిచండిక అనువారు ఎనమండుగురు దుర్గలు. ఈ దుర్గలను తూర్పు మొదలు ఎనిమిది దిక్కులందును స్థాపించి పూజింపవలెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana - 161 🌹
✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj
Chapter 50
🌻Characteristics of an image of the Goddess - 1 🌻
The Lord said:
1-5. (The image of) Caṇḍī may have twenty hands and may hold the spear, sword, dart, disc, noose, club, ḍamaru (a small drum) and spike in the left hands and also (show) protective posture (and) the snake as the noose, club, axe, goad, bow, bell, banner, mace, mirror, and iron mace in the (right) hands.. Or (the figure of) Caṇḍī is made to have ten hands, with the buffalo placed below with its head fully severed and the demon as issuing forth from (its) neck with rage and brandishing his weapon, holding spike in the hand, vomitting blood, his hairs. (stained) with blood and blood dripping out from the eyes. (forming) a garland (on the chest), being devoured by the lion and well-bound by the noose in the neck. (The goddess is represented as) resting her right foot on the lion and the left foot on. the demon underneath.
6-12. This form of Caṇḍikā, the destroyer of enemies. (is made as) having three eyes and endowed with weapons. (This) Durgā is to be worshipped with the nine elements in order in a diagram of nine lotuses from her own form at the beginning, centre and the eastern and other (directions). (The image should be made as) possessing eighteen arms (carrying) a human head, club, mirror, tarjanī (a kind of weapon), bow, banner and. a little drum in the right hand and the noose, spear, mace, trident, thunderbolt, sword, goad and dart in the left hand. The others (Rudracaṇḍā and other goddesses) should be endowed with the same weapons in their sixteen hands except the little drum and tarjanī (a kind of weapon).
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
Comments