🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 162 / Agni Maha Purana - 162 🌹
✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ
శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.
ప్రథమ సంపుటము, అధ్యాయము - 50
🌻. దేవీ ప్రతిమా లక్షణములు - 2 🌻
ఉగ్రచండ యను తొమ్మిదవ దుర్గను మధ్య భాగమున స్థాపించి పూజింపవలెను. రుద్రచండ మొదలగు ఎనమండుగురు దుర్గల దేహకాంతి వరుసగ గోరోచనాసదృశముగను, అరుణముగను, నల్లగను, నీలముగను, తెల్లగను, ధూమ్రముగను, పచ్చగను, తెల్లగను ఉండును. వీరందరును సింహవాహనులై మహిషాసురుని కంఠము నుండి ఆవిర్భవించిన పురుషుడు శస్త్ర ధారియై యుండును. ఈ దుర్గాదేవులు వాని జుట్టు, తమ చేతులతో పట్టుకొని యందురు.
ఈ నవదుర్గలును ఆలీఢమున (కుడికాలు వెనుకకు తన్నిపెట్టి ఎడమకాలు ముందుకు వంచి నిలబడుటకు ఆలీఢమని పేరు) ఈ నవ దుర్గలను స్థాపించి పూజించినచో పుత్రపౌత్రాభివృద్ధి కలుగును చండికాది రూపములో పూజింపబడునది గౌరియే. హస్తములో కుండి, అక్షమాల, గద, అగ్ని ధరించినచో ఆమెకే ''రంభ'' అని పేరు. వనము నందు ఆమెకే ''సిద్ధ'' యని పేరు. సిద్ధావస్థలో ఆమె వద్ద అగ్ని ఉండదు. ''లలిత'' కూడ గౌరియే. ఆమె స్వరూపమిట్లుండును- ఒక ఎడమచేతిలో కంఠసహితమైన ముండము (భిన్న శిరస్సు), రెండవచేతిలో దర్పణము, క్రింది కుడిచేతిలో ఫలాంజలి, పైచేతిలో సౌభాగ్యముద్ర ఉండును. లక్ష్మి కుడిచేతిలో కమలము. ఎడమచేతిలో మారేడు పండు ఉండును.
సరస్వతి రెండు చేతులలో పుస్తకము, అక్షమాల ఉండును. మిగిలిన రెండు చేతులలో వీణ ఉండును. గంగాదేవి తెల్లని దేహచ్ఛాయతే మకరారూఢయై ఒక హస్తము కలశమును, మరియొక హస్తమున కమలమును ధరించి యుండును. యుమునాదేవి శ్యామవర్ణ. రెండు హస్తములందును కలశములు ధరించి తాబేలుపై నిలచి యుండును. తుంబురని ప్రతిమ వీణా సహితముగా నుండవలెను. అతని శరీరకాంతి తెల్లగా నుండును. శంకరుడు శూలపాణియై, వృషభము నెక్కి మాతృకలముందు వెళ్ళచుండును. బ్రహ్మపత్నియైన సావిత్రి గౌరవర్ణముగలది. నాలుగు ముఖములుండును. కుడి చేతులలో అక్షమాల, స్రుక్కు ఉండును. ఎడమ చేతులలో కుండము, అక్షపాత్ర ఉండును, వాహనము హంస
శంకరుని పత్నియగు పార్వతి వృషభారూఢయై కుడిచేతులలో ధనుర్బాణములను, ఎడమ చేతులలో చక్ర-ధనస్సులను ధరించి యుండును. ఎఱ్ఱని కాంతి గల కౌమరీ శక్తి నెమలిపై ఎక్కి, రెండు చేతులందును శక్త్యా యుధములను ధరించి యుండును.
సశేషం.... 🌹 🌹 🌹 🌹 🌹 🌹 Agni Maha Purana - 162 🌹 ✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj Chapter 50 🌻Characteristics of an image of the Goddess - 2 🌻 The nine (goddesses) commencing with Rudracaṇḍā are Rudracaṇḍā, Pracaṇḍā, Caṇḍogrā, Caṇḍanāyikā, Caṇḍā, Caṇḍavatī, Caṇḍarūpā, Aticaṇḍikā and Ugracaṇḍā stationed at the centre. (They are made to be) coloured as the rocanā. (yellow pigment), red, black, blue, white, purple, yellow and white and as riding the lion. Then the buffalo as a human (form) should be held by the hair by the nine (forms) of Durgā holding weapons. 13. They are in the ālīḍha[1] posture. They have to be -established for the increase of progeny; as also (the forms) Gaurī, Caṇḍikā and others (as well as the forms) Kuṇḍi, Akṣararadā (and) Agnidhṛk. 14-15. She is the same as Rambhā. (She is) accomplished and devoid of fire. (She is) also Lalitā. (She) holds the severed head along with the neck in the left (hand) and a mirror in the second hand. (The image of) Saubhāgyā (is made) as holding fruits in the folded palms on the right side. (The image of) Lakṣmī holds the lotus in the right hand and the śrīphala (bilva fruit) in the left. 16. (The image of) Sarasvatī (should be made as holding) a book, rosary and lute in the hands. (The image of) Jahnavī (the river Ganges) (is represented) as holding a pot and flower in the hand (and standing) on the crocodile and of white complexion. 17. (The image of the river) Yamunā is worshipped as mounted on the tortoise and as holding a pot in the hand and of dark complexion. (The image of) Tumburu is represented as white (in colour), holding a lute and trident and riding a bull. 18-19. The four-faced Brāhmī (the female-energy of Brahmā) (is represented) as of fair complexion, riding a swan and as -carrying a rosary, different vessels such as surā and kuṇḍa in the left hand. Śāṅkarī is represented as white, (seated) on a bull holding the bow and arrow in the right hand and the disc and the bow in the left hand. Kaumārī (is represented) as red in colour, riding the peacock and having two arms, holding the spears.
Continues.... 🌹 🌹 🌹 🌹 🌹
Comments