🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 59 / Agni Maha Purana - 59 🌹
✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 22
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.
🌻. స్నానవిధి నిరూపణము 🌻
నారదుడు పలికెను.
యాగవూజాది క్రియలు చేయుటకు ముందు చేయదగిన స్నానమును గూర్చి చెప్పెదను. నృసింహమంత్రము నుచ్చరించుచు మృత్తికను గ్రహించి, దానిని రెండు భాగములుచేసి ఒకదానిచే మలస్నానము చేయవలెను. మునిగి, ఆచమనము చేసి, నృసింహమంత్రముచే న్యాసము చేసి, రక్ష చేసికొని పిమ్మట ప్రాణాయామపూర్వకముగా విధిస్నానము చేయవలెను. 1,2
అష్టాక్షరమంత్రమును జపించుచు, శ్రీ మహావిష్ణువును హృదయములో ధ్యానించుచు అరచేతిలో మట్టిని మూడు భాగములుగా చేసి ఉంచుకొని తరవాత నృసింహమంత్రము తము జంపిచుచు దిగ్బంధము చేయవలెను. వాసుదేవ మంత్రమును జపించుచు సంకల్పించి తీర్థమును స్పృశించసలెను. వేదాది మంత్రములచే గాత్రమును తుడిచికొని మూర్తిలో నున్న దేవుని ఆదాధించి. స్మరించుచు, వస్త్రము ధరించి అఘమర్షణము చేయవలెను (అఘమర్షణ మంత్రములను పఠించవలెను).
మంత్రములచే విన్యాసము చేసి, చేతిలోనున్న జలము నిర్మార్జనము చేసి, నారాయణ మంత్రముతో ప్రాణాయూమము చేసి, జలమునను వాసనచూచి విడిచిపెట్టవలెను. హరిని ధ్యానించుచు అర్ఘ్యమునిచ్చి, ద్వాదశాక్షరిని జపించి, యోగపీఠము మొదట క్రమముగ ఇతర దేవతలకు కూడ తర్పణము చేయవలెను. మంత్రములకును దిక్పాలుర వరకు దేవతలకును, బుషులకును. సితృగణములకును, మనుష్యులకును స్థావరాంతములగు సమస్త భూతములకును తర్పణముచేసి, పిమ్మట ఉపవిష్ణుడై అంగన్యాసము చేసి, మత్రోపసంహారము చేసి, యాగ గృహమును ప్రవేశించవలెను, ఇతర పూజలలో ఇట్లే మూలమంత్రాదులచే స్నానము చేయవలెను. 3-8
అగ్ని మహాపురాణములో స్నానవిధి నిరూపించు ఇరువది రెండవ అధ్యాయము సమప్తము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana - 59 🌹
✍️ N. Gangadharan
📚. Prasad Bharadwaj
Chapter 22
🌻 Procedure for bathing prior to a religious rite 🌻
Nārada said:
1. I will (now) describe the (mode of) bathing preceding (any religious) act. Having taken a clod of earth accompanied by (meditation on) the man-lion form (of Viṣṇu), and making it into two parts, (one has to do) mental bathing with one part of it.
2. Having immersed (one’s body in waters) and having partaken (three drops of) water and assigning (on the body) with the lion (man-lion) one has to get himself protected. Then one has to do bathing as laid down, being preceded by the control of the breath.
3. Meditating on Lord Hari in one’s heart with the eight-syllabled mantra (Oṃ namo Vāsudevāya, Oṃ namo Nārāyaṇāya or Oṃ namo Narasiṃhāya), the clod of earth (is made) into three parts on the palm and protection in (all) the quarters (is achieved) with the recitation of (the mantra) for the lion (man-lion).
4-7. With the recitation (of the mantra) ofVāsudeva, having mentally resolved the sacred water and having rubbed the body with vedic mantras and having adored the image of deity and having remembered the aghamarṣaṇa (sūkta) which destroys sins) and putting on a cloth, perform the (following) rite. Putting water on the palm, accompanied by mantras and wiping off waters on the palm, controlling with the Nārāyaṇa (mantra), the air is inhaled and water is let off. Then contemplating on Hari, offering waters (of oblation) and reciting the twelve-syllabled (mantra), appeasing all others with devotion commencing in order with the seat of meditation, the mantras upto all the guardian deities of the quarters, the sages, clans of manes, men, all beings and ending with the mobile (beings) are placed.
8. Then having assigned limbs (for the different deities), withdrawing the mantras one has to go to the house for performing rites. In this way, one has to bathe with the mūlamantra[1].
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
06 Jun 2022
Comments