top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ మదగ్ని మహాపురాణము - 61 / Agni Maha Purana - 61



🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 61 / Agni Maha Purana - 61 🌹


✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు


ప్రథమ సంపుటము, అధ్యాయము - 23


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.


🌻. ఆదిమూర్త్యాది పూజావిధి -2‌ 🌻


జలకుంభమును ఎడమ వైపునను, పూజాద్రవ్యములను కుడి వైపునను ఉంచవలెను. అస్త్రముచే ప్రక్షాళనచేసి గంధపుష్పాన్వితము నైన అర్ఘ్యములను ఉంచవలెను. సర్వవ్యాప్తము, జ్యోతిఃస్వరూపము అయిన చైతన్యములను "అస్త్రాయఫట్‌" అని అభిమంత్రించిన, ఉదరముచే యోగబీజము నడిపి. హరిని ధ్యానించి, పూర్వాదియోగ పీఠము నందు ధర్మమును.


వైరాగ్యమున, ఐశ్వర్యమును, ఆగ్నేయదిక్కు మొదలైన వాటిని, ఆధర్మము మొదలగు అంగములకు, పీఠమునందు కూర్మమును, అనంతుని, యముని, సూర్యాదుల మండలములను, విమల మొదలగు కేసరస్థానము నందున్న గ్రహణములను, కర్ణిక (ఈ పద్మము మధ్యనున్న దుద్దు యందున్న గ్రహణములనుముందు తన హృదయము నందు ధ్యానము చేసి పిమ్మట మండలము పై ఆవాహనము చేసి అర్చించవలెను.


వైష్ణవ విద్యానుసారముగా అర్ఘ్య-పాద్య- ఆచమన - మధుపర్క - స్నాన, వస్త్ర - యజ్ఞోపవీత - అలంకార - గంధ - పుష్ప - ధూప - దీప- నైవేద్యములను సమర్పింపవలెను. పూర్వాది దిక్కులందు అంగదేవతలను పూజించవలెను. తూర్పు-పడమర దిక్కులందు గరుత్మ తుని, కుడివైపున చక్రమును, గదను, ఎడమవైపున శంఖమును, ధనస్సును ఉంచవలెను దేవుని ఎడమవైపున అంబుల పొదులను, కుడివైపున ఖడ్గమును. ఎడమ వైపున డాలును ఉంచవలెను. కుడి వైపున అగ్రభాగమున పుష్టిని ఉంచవలెను. 9-16



సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹



🌹 Agni Maha Purana - 61 🌹


✍️ N. Gangadharan

📚. Prasad Bharadwaj


Chapter 23


🌻 Mode of performing worship - 2🌻


9. Having placed the water-jar on the left and the materials for worship on the right and having washed (them) with the implements and water offerings, they are placed together with flowers and scents.


10-11. Having sprinkled the radiant (form) of consciousness and omnipresence with waters (purified) by the repetition (of the mantra of the lord) eight times (and) having sprinkled the hand with mantra ending with phaṭ and then having meditated on Hari, with his face directed towards the (southeast) direction (presided over by) Agni, (one has to pray) for virtue, knowledge, detachment, (and) supremacy. (Facing) the east (and other directions), (one has to get rid) of his sins and physical impurities remaining in yogic postures.


12. (Remaining) in Kūrma (tortoise) posture, one should adore Ananta, Yama, the solar and other luminous regions and other planets (occupying) the filament and pericarp (of the lotus).


13-14. Having first meditated (on them) in one’s heart and having invoked and worshipped in a circle, (offerings) of waters of respect, waters for washing feet, waters for rinsing, madhuparka[1] (respectful offering), bath, cloth, sacred thread, scents, flowers, incense, lamp and eatables (are made) (along) with the formula (known as) Puṇḍarīkākṣa.


15. First, one has to worship the limbs and then Brahmā at the doorway in the eastern (direction), the disc and the club in the southern (direction); the conch, and the bow have to be assigned in the corner (governed by) the moon.


16. One should assign the quiver and sword to the left and right side of the deity, the armour and nourishment on the left, and the prosperity on the right in front.



Continues....


🌹 🌹 🌹 🌹 🌹




コメント


Post: Blog2 Post
bottom of page