top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ మదగ్ని మహాపురాణము - 62 / Agni Maha Purana - 62



🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 62 / Agni Maha Purana - 62 🌹


✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు


ప్రథమ సంపుటము, అధ్యాయము - 23


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.


🌻. ఆదిమూర్త్యాది పూజావిధి -3‌ 🌻


వనమాలను, శ్రీ వత్సమును, కౌస్తుభమును కూడ ఉంచవలెను. దిక్పాలకులను వెలుపల ఉంచవలెను. ఈ అంగదేవతల నందరిని వారి వారి మంత్రములచే పూజించవలెను. విష్ణుపూజ పూర్తియైన పిమ్మట అంగదేవతలను వ్యస్తరూపమునను, నమస్తరూపమునను బీజాక్షరయుక్త మంత్రములతో పూజింపవలెను. జపించి, ప్రదక్షిణముచేసి, స్తుతించి, అర్ఘ్యమును సమర్పించి "నేనే బ్రహ్మను, నేనే హరిని" అని ధ్యానము చేసి హృదయమునందు ఉంచుకొనవలెను. 17-18


అవాహనము చేయు నపుడు 'అగచ్ఛ' అనియు, ఉద్వాననము చెప్పునపుడు 'క్షమస్వ' అనియు అనవలెను. ఈ విధముగా అష్టాక్షరాదులచే పూజ చేసి ముక్తిని పొందును. 19


ఇంతవరకును ఏకమార్త్యర్చనము చెప్పబడినది. ఇపుడు నవ వ్యూహార్చనమును వినుము. అంగుష్ఠద్వయము నందును తర్జన్యాదులందును వాసుదేవుని, బలాదులను న్యానము చేయవలెను. పిమ్మట శిలస్సు, లలాటము, ముఖము, హృదయము, నాభి, గుహ్యము, మోకాలు, పాదము వీటియందు న్యాసము చేసి మధ్యయందు పూర్వాదిక్‌ పూజా చేయవలెను.


ఏకపీఠముపై. క్రమముగ, నవ వ్యూహములను, నవ పీఠములను స్థాపించి వెనుకటివలెనే పూజించవలెను. నవాబ్జములందు నవమూర్తుల నావాహనము చేసి నవవ్యూహపూజ వెనుకటివలెనే చయవలెను. పద్మ మధ్యమునందు వాటి యందున్న దేవతను, వాసుదేవుని పూజించవలెను.


అగ్ని మహాపురాణమున ఆదిమూర్త్యాది పూజావిధి యను ఇరువది మూడవ అధ్యాయము సమాప్తము.



సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹




🌹 Agni Maha Purana - 62 🌹


✍️ N. Gangadharan

📚. Prasad Bharadwaj


Chapter 23


🌻 Mode of performing worship - 3🌻


17. One has to worship with respective sacred syllables, the garland of wild-flowers, (the mark) śrīvatsa, (the gem) kaustubha and the presiding deities of the quarters outside and all (the attendant gods) of Viṣṇu as well either partially or wholly.


18-19: One has to worship with the limbs with the sacred syllables partially or wholly. After having repeated (the sacred syllables), doing circumambulation and adoration and offering waters of adoration and the offerings, one has to assign in the heart and after having meditated, “I am the brahman and Hari”, (one has to repeat the words) ‘come’ used in (the ceremony of) invocation and “forgive me” in dismissal (at the conclusion).


20. Having worshipped in this manner with the mantra of eight letters (one becomes eligible) to get liberation. The (mode of) worship of one form (of a deity) has been described. Listen to the (mode of) worship in the structure of nine (apartments).


21-23. Having assigned Vāsudeva, Balarāma) and others to the two thumbs and then at first to the fingers, then to the body, head, forehead, face, heart, navel, organ of generation, knees, (and) between the feet, one has to worship in order, single seat of the deity consisting of nine parts and then the nine seats and of the nine forms consisting of nine parts in nine lotuses as before. Then in the midst of the lotus one has to worship Vāsudeva.



Continues....


🌹 🌹 🌹 🌹 🌹



Comments


Post: Blog2 Post
bottom of page