top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ మదగ్ని మహాపురాణము - 71 / Agni Maha Purana - 71



🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 71 / Agni Maha Purana - 71 🌹


✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు


ప్రథమ సంపుటము, అధ్యాయము - 25


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.


🌻. "వాసుదేవ' 'సంకర్షణ' 'ప్రద్యుమ్న' 'అనిరుద్ధ' మంత్రముల లక్షణములు - 3 🌻


కనిష్ఠక మొదలైన కరాగ్రములందు దేహముపై ప్రకృతిని అర్చించవలెను. పరమ పురుషాత్మయే పరుడు. ప్రకృత్మాత్య ద్విరూపము. ''ఓం పరాయాగ్న్యత్మనే నమః" ఇది వ్యాపక మంత్రము. వసు - అర్క - అగ్నులు త్రివ్యూహాత్మక మార్తులు. ఈ మూడింటిపై అగ్ని న్యాసముచేసి కరదేహములపై వ్యాపకమును విన్యసించి, అంగుళల యుందును, సవ్యాపసవ్య హస్తములయందును, హృదయమునందును, మూర్తియందును, తుర్యరూప మగు త్రివ్యూహమైన తనువునందను వాయ్వర్కులను విన్యసించవలెను.


వ్యాపక మైన ఋగ్వేదమును హస్తమునందును, అంగుళలపై యజుర్వేదము, రెండు అరచేతులలో అథర్వమును శిరోహృదయచరణములయందు సామవేదమును పంచవ్యూహమునందు ఆకాశమును విన్యసించి కరములందును, దేహము నందును అంగుళీ - శిరో - హృదయ - గుహ్య - పాదములందును వాయ్వాదికమును పూర్ముము చెప్పనట్లు న్యసించవలెను.


వాయువు, అగ్ని, జలము, భూమి (ఆకాశము) వీటి సముదాయము పంచవ్యూహము నమస్సు, శ్రోత్రము, త్వక్కు, నేత్రము, జిహ్వ, ఘ్రణము వీటి సముదాయము షడ్వ్యూహము.


వ్యాపక మైన మానసమును విన్యసించి పిమ్మట క్రమముగా అంగుష్ఠాదులందును, శిరస్సు, ముఖము, హృదయము, గుహ్యప్రదేశము, పాదములు - వీటి యందును న్యాసము చేయవలెను. ఇది "పరమాత్మకవ్యూహన్యాసము". ఆదిమూర్తి అగు జీవుడు సర్వవ్యాపకుడు.


భూః, భువః, సువః, మహః, జనః, తపః, సత్యం అను ఈ ఏడింటిని ముందుగా కరమునందును, దేహము, నందును అంగుష్ఠాది క్రమమున విన్యసించవలెను.


ఏడవది తలములం దుండును. లోకేశు డైన దేవుడు దేహమునందు క్రమముగా శిరస్సు, లలాటము, ముఖము, హృదయము, గుహ్యము, పాదములు - వీటియందు ఉండును.


అగ్నిష్టోమము, ఉక్థము, షోడశి, వాజపేయము, అతిరాత్రము, ఆప్తోర్యామము అని యజ్ఞాత్మ సప్తరూపములు కలది.



సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Agni Maha Purana - 71 🌹


✍️ N. Gangadharan

📚. Prasad Bharadwaj


Chapter 25


🌻 Worship regarding Vāsudeva, Saṅkarṣaṇa, Pradyumna and Aniruddha - 3 🌻


20-21. Om (salutation) to the supreme being, the foremost or the first soul. The air and the sun (are his) two forms. The fire the third form having been assigned to pervade hands and the body, wind and the sun in the fingers of hand, this is embodied in the three parts in the two arms, left and the other arm, in the heart, in the body forming the fourth state.


22. The Ṛgveda (is made) to pervade hand. The Yajus (Yajurveda) is assigned to fingers. The form of Atharva (is assigned) to two palms. Thus (assignments are made) in (different limbs) head, heart, upto the feet.


23. As before having assigned the extensive sky to his arm and body, wind and other (elements), to fingers, head, heart, generative organ and the feet.


24. The wind, fire, water, earth (and sky or ether) are spoken as his five forms. The mind, ear, skin, eye, tongue (and) nose are said to be the six forms.


25-28. The extensive mind is assigned from the thumb onwards to the head, mouth, generative organ and the organ of excretion. The prime form is said to be consisting of compassion. It is known as the jīva (life) (which is) all pervasive. The seven (words), earth, ether, heaven, mahas, jana, tapa and satya[5] are assigned duly to hands and the body beginning with thumb. The Lord of the world, the seventh one and existing in the palm (is taken) gradually to the body, head, forehead, mouth, heart, generative organ and feet. This is said to be the Agniṣṭoma.[6] (Next follows the description of) the Vājapeya[7] (and) the Ṣoḍaśī[8] rites.



Continues....


🌹 🌹 🌹 🌹 🌹



Commenti


Post: Blog2 Post
bottom of page