🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 72 / Agni Maha Purana - 72 🌹
✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 25
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.
🌻. "వాసుదేవ' 'సంకర్షణ' 'ప్రద్యుమ్న' 'అనిరుద్ధ' మంత్రముల లక్షణములు - 4 🌻
ధీ, అహంకారము, మనస్సు, శబ్ధము, స్పర్శ - రూప - రసములు - గంధము, వ్యాపకమైన బుద్ధి వీటిని క్రమముగా కరమునందను, దేహమునందును విన్యసించవలెను. పాదములు, తలములు, శిరస్సు, లలాటము, సుఖము, హృదయము, నాభి, గుహ్యప్రదేశము, పాదము వీటిపై విన్యసించవలెను. జీవుడు అష్టవ్యూహుడని చెప్పబడినాడు.
జీవుడు, బుద్ధి, అహంకారము, మనస్సు, శబ్ధము, గుణము, వాయువు, రూపము, రసము అని జీవుడు నావాత్మకుడు. అంగష్ఠద్వయము నందు జీవుని, మిగిలిన వాటిని తర్జనిమొదలు వామప్రదేశిని వరకును విన్యసించవలెను. దహముపై, శిరస్సు, లలాటము, ముఖము, హృదయము, నాభి, గుహ్యము, మోకాళ్ళు, పాదములు వీటిపై విన్యసించ వలెను.
దశాత్మకు డగు ఈ జీవుడు వ్యాపకుడుగా చెప్పబడుచున్నాడు. అంగష్ఠద్వయమునందును, తర్జన్యాదులయందును, శిరోలలాట, ముఖ, హృదయ, నాభి, గుహ్య, జాను, పాదములందును విన్యసించవలెను. మనః శ్రోత్ర, చక్షుర్, జిహ్వా, ఘ్రాణ, వాక్, పాణి, పాద, పాయు, ఉపస్థరూపమున ఏకాదశాత్మరు డగు ఈ జీవుని శ్రోత్రమునందను, అంగుష్ఠ ద్వయము నందును, తర్జని మొదలు ఎనిమిదింటియందును, మిగిలిన తలద్వయమునందును విన్యసించవలెను. మనస్సు వ్యాపకము.
అట్లే దేహముపై క్రమముగా శిరో, లలాట, ముఖ, హృదయ, నాభి, గుహ్య, ఊరుద్వయ, జంఘా, (పిక్కలు) గుల్ఫ (చీలమండలు), పాదములపై విన్యసించవలెను.
విష్ణువు, మధుహరుడు, త్రివిక్రముడు, వామనుడు, శ్రీధరుడు హృషీకేశుడు, పద్మనాభుడు, దామోదరుడు, కేశవుడు, నారాయణుడు, మాధవుడు, గోవిందుని అని ద్వాదశాత్ముడు. వీటిలో విష్ణువును వ్యాపకునిగా విన్యసించి, మిగిలిన వారిని అంగుష్ఠాదులందును, తలాదులందును, పాదమునందును, జానువునందను, కటియందును, శిరస్సు, శిఖ, ఉరస్సు, కటి, ముఖము, జానువు, వాదము మొదలైన వాటియందును విన్యసించవలెను. పంచవింశవ్యూహములు కలవాడును, షడ్వింశవ్యూహములు కలవాడును, ఎట్లనగా,
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana - 72 🌹
✍️ N. Gangadharan
📚. Prasad Bharadwaj
Chapter 25
🌻 Worship regarding Vāsudeva, Saṅkarṣaṇa, Pradyumna and Aniruddha - 4 🌻
29-32. Atirātra[9] and Aptoryāma[10] (rites will also be described). The soul of the sacrifice which has seven forms extending to the intellect, ego, mind, sound, touch, colour, taste, smell, comprehension, should be assigned duly to the fingers and the body. A person has to assign it to the teeth, palms, head, forehead, face, heart, navel, the generative organ and the feet. These are remembered as the eight Vyūhas (parts). The life which consists of nine parts—life, intellect, ego, mind, sound, quality, wind, colour, and taste, is assigned to two thumbs. They (are placed) in order on the left hand by means of the forefinger and other fingers.
33. Indra remains pervading the ten (limbs) consisting of body, head, forehead, mouth, heart, navel, the generative organ, two knees and feet.
34-35. The fire (is assigned) to two thumbs. Mind consisting of eleven parts—ear, skin, eye, tongue, smell, speech, hand, foot, anus is assigned to head, forehead, face, heart, navel, the generative organ, two knees and feet with the forefinger.
36. The mind is made to pervade the male organ. The two thumbs (are made to pervade) the ear. Commencing with the fore-finger in order, the eight fingers (are assigned). The (two fingers) left over are assigned to palm.
37. The head, forehead, month, heart, navel (are assigned) in order to generative organ, two thighs, shanks, ankles and feet.
38-39. Viṣṇu, Madhuhara (killer of the demon Madhu), Trivikrama, Vāmana, Śrīdhara, Hṛṣīkeśa, Padmanābha, Dāmodara, Keśava, Nārāyaṇa, Mādhava, Govinda (are the names of Viṣṇu). Viṣṇu is made to pervade.
40. The thumb (and other fingers), palms, feet, two knees, waist are assigned to head, crown of head, waist, knees. and feet.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
Comments