🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 79 / Agni Maha Purana - 79 🌹
✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 27
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.
🌻. దీక్షా విధి - 5 🌻
గర్భాధానమును, జాతకర్మను, భోగమును, లయమును, ఆ అగ్నియందే ఎనిమిది హోమములు చేసి, పిమ్మట శుద్ధహోమము చేవలెను.
పండితుడు, జ్ఞానయోగముచేత ఆ పరమున పరమాత్మయందు విలీనముచేసి, బంధ విముక్తడై జీవుడు సుద్ధము, జ్ఞానస్వరూపము, నిర్వికారము, పరమానందరూపము అగు పరమాత్మయందు ఆనందము పొందు చున్నట్లు భావింపవలెను.
పిమ్మట పూర్ణాహుతి ఇవ్వవలెను. ఈ విధముగా దీక్ష పూర్తియగును.
దీక్షా-హోమ-విలయముల కుపయుక్తములగు ప్రయోగమంత్రములను చెప్పెదను. ''ఓం యం భూతాని విశుద్ధం హుం ఫట్'' అను మంత్రముచే తాడనమును, వియోజనమును చేయవలెను.
''ఓం యం భూతాన్యాపాతయే7హమ్'' అను మంత్రముచే ఆదానము చేయవలెను. ప్రకృతితో యోజనము చేయు మంత్రమును వినుము, 'ఓం యం భూతాని పుంశ్చాహో'' అనునది ప్రయోజన మంత్రము.
హోమ మంత్రమును, పిమ్మట పూర్ణాహుతి మంత్రమును చెప్పెను- ''ఓం భూతాని సంహర స్వాహా'' అనునది హోమమంత్రము ''ఓం శ్రీం ఓం నమోభగవతే వాసుదేవాయ వౌషట్'' అనునది పూర్ణాహుతి మంత్రము. పూర్ణాహుత్యనంతరము తత్త్వమునందు శిష్యుని సాధించవలెను. ఈ విధముగా బుధుడు క్రమముగ సర్వతత్త్వ సంశోధనము చేయవలెను.
నమః అనునది అంతమునందుగల ఆయా తత్త్వముల బీజములతో తాడనాది పూర్వకముగా తత్త్వసంశోధనము చేయవలెను. 'ఓం వాం కర్మేన్ద్రియాణి నమః' 'ఓం దేం బుద్ధీన్ద్రియాణి నమః' ఇత్యాది విధమున చేయవలెను. తాడనాది ప్రయోగము 'యం' బీజముతో చేసినట్లె చేయవలెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana - 79 🌹
✍️ N. Gangadharan
📚. Prasad Bharadwaj
Chapter 27
🌻 Mode of performing the initiation rite - 5 🌻
44. After offering eight oblations each (in favour) of (Garbādhāna[7], Jātakarma[8], enjoyment and dissolution, he should offer them for purification.
45. The preceptor should take up pure materials and bring together the two excellent principles in order in such a way they are not broken.
46. Then the soul, freed from fetters is immersed in the supreme soul in the supreme undecaying position.
47. A learned person has to think of the peaceful, supreme, blissful, pure intellect and offer the completing oblation. Thus ends the (rite of) initiation.
48. I shall describe the mystic syllables for the application with which the oblation (relating to) the initiation is closely associated:
Oṃ, Yaṃ, the goblins, the pure huṃ, phaṭ. By this one should strike and separate the two.
49. Oṃ, Yaṃ, I destroy the goblins. After having seized this (syllable) (you) hear (the mode of) yoking it with the nature. Oṃ, aṃ, the goblins and the males. I shall describe the mystic syllable for the oblation as well as the final oblation.
50. Oṃ, destroy the goblins; oblations. Oṃ, aṃ, Oṃ, salutations to the Lord Vāsudeva, vauṣaṭ. After the final oblation the disciple has to be accomplished. In this way the wise man has to purify the principles.
51. Ending with (the word) salutation and with the basic syllable sva and preceded by beating (one has to say) Oṃ, vāṃ, the organs of action, Oṃ, deṃ, the organs of intellect (sense). With the syllable yam similar beating etc. are done.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
コメント