🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 81 / Agni Maha Purana - 81 🌹
✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 27
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.
🌻. దీక్షా విధి - 7 🌻
గురువు, సమస్తమైన దైవమార్గమును గాని, ఆధ్యాత్మికముగా బావన చేయబడిన భౌతిక మార్గమునుగాని, శిష్యుని దేహముపై ధ్యానించి, ముందుగా వాసుదేవాది దేవతలను, అగ్ని మొదలైనవారిని, క్రమముగ వారి వారి మంత్రములతో ఎనిమిదేసి ఆహుతులచేత తృప్తిపరచి, విసర్జనము చేయవలెను.
పిమ్మట సంహారక్రమమున హోమముచే శోధనము చేయవలెను. శిష్యుని దేమముపై కట్టిన కర్మరూప సూత్రములను విడిపించి, వాటిని ఒకచోట పోగుచేసి, తత్త్వ శోధనము చేయవలెను. ప్రాకృతికాగ్నియందును, ఆధిదైవిక విష్ణువునందును లయముచేసి, అశుద్ధులతో కూడిన తత్త్వమును పూర్ణాహుతిచే శుద్ధము చేయవలెను.
ప్రాకృతిక గుణములను దహించి శిష్యుడు ప్రకృతిస్థుడైన పిమ్మట గురువు ఆతనిని విముక్తుని చేయవలెను; లేదా శిశువులను (శిష్యులను) అధికారమునందు నియుక్తులను చేయవలెను.
లేదా గురువు భావస్థితుడై మరియొక శక్తిదీక్ష యైన చేయవలెను. యతులు గాని, నిర్ధనులు గిన భక్తి పూర్వకముగ తన నాశ్రయించి నపుడు స్థండిలముపై విష్ణువును పూజించి, పార్శ్వమునందే కూర్చుండబెట్టవలెను. శిష్యుడు దేవతాభిముఖుడుగా ఉండగా గురువు ముఖమును అడ్డముగా త్రిప్పి కూర్చుండవలెను. స్వీయపర్వములతో వికల్పిత మైన సకలాధ్వమును శిష్యునిదేహముపై ధ్యానించి పిమ్మట ఆధిదైవికపూజ చేయవలెను. ధ్యానమోగముచే చింతించి, వెనుక చెప్పిన విధమున తాడనాదికముచే క్రమముగ స్థండిలముపై నున్న హరియందు సకలతత్త్వసంశోధనము చేయవలెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana - 81 🌹
✍️ N. Gangadharan
📚. Prasad Bharadwaj
Chapter 27
🌻 Mode of performing the initiation rite - 7 🌻
63-65. Then purification is made by oblation in the order of destruction. Having released all the fetters of deeds, the preceptor, has to purify the principles, having drawn them in order from the body of the disciple. Having dissolved in the fire, the primordial Viṣṇu and the Supreme Spirit, the pure principle is accomplished by (offering) final oblation with impure prin-•ciple. After the disciple had attained his natural state, he has to consume all the qualities of the primordial being.
66. The preceptor has to release or bind the children. Or the preceptor remaining in his natural state has to perform a different kind of initiation (called) Śaktidīkṣā[9].
67-69. Having worshipped Viṣṇu placed nearby with the lad in an altar and (who) is being adored with the devotion of ascetics and mendicants, the pupil remains facing the deity, the self (preceptor) facing obliquely. After having contemplated upon the entire course which has been resolved by him (the preceptor) according to the phases of the moon, (the preceptor) has to think deeply with contemplation on the Lord, the supreme spirit, stationed in the body of the disciple.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
Comments