top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ మదగ్ని మహాపురాణము - 83 / Agni Maha Purana - 83


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 83 / Agni Maha Purana - 83 🌹


✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ


శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.


ప్రథమ సంపుటము, అధ్యాయము - 28


🌻. ఆచార్య అభిషేక విధానము 🌻


నారుదుడు పలికెను : శిష్యుడు ఆచార్యాభిషేకము ఎట్టు చేయవలెనో చెప్పదను. దీని చేత సాధకుడు సిద్ధిని పొందును. రోగి రోగ విముక్తు డగును. రాజు రాజ్యమును, స్త్రీ కుమారుని, పాపవినాశమును పొందును.


తూర్పున ప్రారంభించి మంచి రత్నములతో కూడిన మట్టి కుండలను మండప మధ్యభాగమున ఉంచవలెను. వాటిని సహస్రావర్తితములు లేదా శాతావర్తితములు చేయవలెను. మండలమునందు తూర్పు - ఈశాన్యదిక్కులందు పీఠముపై విష్ణువును ఉంచి, సాధకునికిని, శిష్యునికిని సకలీకరణము చేయవలెను. పిమ్మట గీతాదిపూర్వకముగా అచార్యునకు పూజ చేసి అభిషేకము చేయవలెను.


యోగపీఠాదులను సమర్పింపవలెను. ''నీవు నరులను అనుగ్రహింపవలెను'' అని ప్రార్థించవలెను. గురువు కూడ శిష్యునకు నియమము లన్నియు బోధించవలెను. ఈ విధముగా గురురక్షణ పొందిన శిష్యుడు అన్ని లాభములను సంపాదింపగలడు.


అగ్ని మహాపురాణములో ఆచార్యాభిషేక మను ఇరువది ఎనిమిదవ అధ్యాయము సమాప్తము.



సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Agni Maha Purana - 83 🌹


✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj


Chapter 28


🌻 Mode of anointment for the preceptor 🌻


1-2. I shall describe the anointment of the preceptor as the son would do and by which an aspirant would become accomplished and a diseased would get rid of the disease, the king (would get his) kingdoṃ, a woman would get a child and also. destruction of impurity. Pictures made of earth and endowed with gems are to be placed in the middle, the east etc.


3. Thousands or hundreds (of them are placed) in a circular form and Viṣṇu in the east and north-east at an elevated place in an altar.


4. Having placed all of them the aspirant (should assign) his son in parts. After having worshipped well the anointment should be performed preceded by songs etc.


5. Men should offer yogic seats etc. requesting his favour. The preceptor also should announce the terms and the pupil (initiated) into the secrets then becomes the recipient of all (that he wants).



Continues....


🌹 🌹 🌹 🌹 🌹




Comentarios


Post: Blog2 Post
bottom of page