🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 85 / Agni Maha Purana - 85 🌹
✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ
శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.
ప్రథమ సంపుటము, అధ్యాయము - 29
🌻. సర్వతోభద్ర మండల విధి - 2 🌻
పంచదలాదుల నిర్మాణమునకు కూడ ఈ విధముగనే మత్స్యచిహ్నములచే కమలములు నిర్మించి ఆకాశ##రేఖకు బైట నున్న పీఠభాగమునందలి కోష్ఠములను తుడిచివేయవలెను. పీఠభాగముయొక్క నాలుగు కోణములలో మూడేసి కోష్ఠకములను ఆ పీఠముయొక్క నాలుగు పాదాలుగా కల్పింపవలెను.
నాలుగు దిక్కులందును మిగిలిన రెండేసి జోడులను, అనగా నాలుగు కోష్ఠకములను, తుడిచి వేయవలెను. అవి పీఠమునకు పాదాలుగా ఏర్పడును. పీఠము వెలుపల నాలుగు దిక్కులలో ఉన్న రెండు రెండు పలక్తులను తుడిచివేసి వీథి ఏర్పరుపవలెను. పిమ్మట నాలుగు దిక్కులందును నాలుగు ద్వారములు ఏర్పరుపవలెను.
విద్వాంసుడు, ద్వారముల పార్శ్వభాగములందు ఎనిమిది శోభాస్థానములను, వాటి పార్శ్వభాగములందు ఉపశోభాస్థానములను, ఏర్పరుపవలెను. శోభలు ఎన్నియో ఉపశోభలు కూడ అన్నియే ఉండును.
ఉపశోభల సమీపమునందున్న స్థానములకు కోణము లని పేరు. పిమ్మట నాలుగు దిక్కులందును మధ్యనున్న రెండేసి కోష్ఠములను, వాటి బాహ్యపంక్తిలోని, మధ్యకోష్ఠములను ద్వారనిర్మాణమునకై ఉపమోగింపవలెను. వాటి నన్నింటిని కలిపి తుడిచివేయగా నాలుగు ద్వారము లేర్పడును. ద్వారముయొక్క లెండు పార్శ్వములందలి క్షేత్రమునకు వెలుపల నున్న పంక్తియందలి ఒక్కొక్క కోష్ఠమును, లోపలి పంక్తియందలి మూడు మూడు కోష్ఠములను శోభానిర్మాణార్థమై తుడిచి వేయవలెను.
శోభాపార్శ్వభాగమునందు ఇందులకు విపరీతముగ చేయుటచే అనగా క్షేత్రమునకు వెలుపల నున్న పంక్తియందలి మూడు మూడు కోష్ఠములను, లోపలనున్న పంక్తియందలి ఒక్కొక్క కోష్టమును తుడిచివేయగా ఉపశోభలు నిర్మింపబడును. పిమ్మట కోణమునకు లోపల, వెలుపల నున్న మూడు మూడు కోష్ఠమలు భేదమును తుడిచివేసి ఒకటిగా చేసి చింతనము చేయవలెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana - 85 🌹
✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj
Chapter 29
🌻 Mode of worshipping Hari in the figure called Sarvatobhadra - 2 🌻
Nārada said:
12. Having drawn a fish with five petals of a lotus for the sake of success, the skyline (is made) outside the seat (altar). The compartments are (cleanly) swept.
13. Four other places for the feet (are made ready) in the angular points. Besmeared vessels are kept in the four quarters.
14. Two rows are marked in the quarters for the sake of pathway. Doors are made in all the four quarters.
15. A wise man has to make eight ornaments of graceful expressions by the side of the doors. An equal number of ornaments are also to be made by their side.
16. Then corners of ornaments should be made. In each one of the middle compartments in all the four directions, two figures are drawn.
17. The four outer compartments are cleansed, as well as one on each side. Three figures are drawn on each side of the petal for beautifying it.
18. Similarly, three ornaments are to be drawn on the oppo-:site direction inside the angular point as well as outside without any difference between the two.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
Comments