🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 91 / Agni Maha Purana - 91 🌹
✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ
శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.
ప్రథమ సంపుటము, అధ్యాయము - 30
🌻. కమలములలోని దేవతల మండల విధి -2 🌻
పిమ్మట వెలుపలి ఆవరణమునందు పాయు-ఉపస్థల పూజ చేసి, పండ్రెండు మాసాల అధిపతులను, పురుషోత్తముడు మొదలగు ఇరువది యారు తత్త్వములను పూజించవలెను. మాసాధిపతుల పూజ చక్రాబ్జముపై క్రమముగా చేయవలెను. ఎనిమిది, లేదా ఆరు, లేదా ఐదు ప్రకృతులను అచటనే పూజింపవలెను. పిమ్మట మండలములపై వేరు వేరు రంగులు గల చూర్ణములు చల్లవలెను.
ఎచట ఏ రంగుగల చూర్ఱము చల్లవలెనో చెప్పదను; వినుము కమలకర్ణిక రంగు పసుపు పచ్చగా ఉండవలెను. సమస్తరేఖులును సమప్రమాణము గలవై తెల్ల రంగలో నుండవలెను. రెండు హస్తముల మండలముల రేఖలు బొటనవ్రేలంత లావుగా ఉండవలెను.
ఒక హస్తము మండలమునందలి రేఖలు బొటనవ్రేలి లావులో సగము లావు ఉండవలెను. రేఖలు తెల్లగా ఉండవలెను. పద్మములకు తెల్లరంగును, సంధులకు నలుపు లేదా నీలి రంగు వేయవలెను. కేసరములు ఎరుపు-పసుపురంగులో ఉండవలెను. కోణములం దున్న కోష్ఠములను ఎఱ్ఱని రంగు గల చూర్ణముతో నింపవలెను. ఈ విధముగా యోగపీఠమును యథేష్టముగ అన్ని రంగులతోను అలంకరింపవలెను. వీథిని లతలతోడను, పత్రాదులతోడను అలంకరింపవలెను. పీఠద్వారమును తెల్లని రంగు గల చూర్ణముతోను, శోభాస్థానములను ఎఱ్ఱని చూర్ణములతోడను నింపవలెను.
ఉపశోభలపై నీలి రంగు చూర్ణము చల్లవలెను. కోణముల శంఖములను తెల్లగా చిత్రింపవలెను. ఇది భద్రమండలముపై రంగు లుంచు విధానము. ఇతరమండలముపై గూడ ఈ విధముగనే అనేకవిధము లగు వర్ణములు గల చూర్ణములు చల్లవలెను. త్రికోణమండలము తెలుపు - ఎరుపు - నలుపురంగులతో అలంకరింపవలెను. ద్వికోణమును ఎరుపు-పసుపురంగులతో అలంకరింపవలెను. చక్రకమలమునందలి నాభిస్థానమును నలుపురంగు చూర్ఱముతో అలంకరిపవలెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana - 91 🌹
✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj
Chapter 30
🌻 Mode of worship of different gods in specially drawn lotus figures - 1 🌻
10. Having worshipped the anus and penis one has to worship the lords of the twelve months as well as the twenty-six forms commencing with Puruṣottama in the external enclosure.
11. Among these the Lords of the months are to be worshipped in the lotus of the disc. Then the eight, six, five or four (total twenty-three) principles of the primordial matter (are to be worshipped) in another (lotus).
12-13. Then one has to dust in a drawn circular altar. (You) hear. The pericarp should be of yellow colour, and all the lines equal and white. (They) should be two cubits long and one thumb in breadth. Half the length are white. The joints (should be coloured) white, black or dark-blue.
14. The filaments should be red and yellow-coloured. The corners should be filled with red. The yogic seat should be bedecked with any of the colours according to one’s own desire.
15. The pathway is decorated with canopy of creepers and leaves. The entrance to the altar (should be painted) white, bright-red and yellow.
16. Ornamentation of all the white corners (is done) with blue (colour). It has been said that the altar bhadraka should be filled (with the colours) and in this way the other (altars) are filled.
17. The three corners should be decorated with pale, red and black, the two corners with red and yellow (and) the centre of the circle by black.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
Comentários