🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 94 / Agni Maha Purana - 94 🌹
✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ
శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.
ప్రథమ సంపుటము, అధ్యాయము - 31
🌻. అపామార్జన (ఆత్మ రక్షణ ) విధానము - 1 🌻
అగ్నిదేవుడు చెప్పెను : ఓ మునీ! ఇపుడు నేను ఆత్మరక్షను, ఇతరుల రక్షను చేయు విధానమును చెప్పచున్నాను. దీనికి ''మార్జనము'' లేదా ''అపామార్జనము'' అని పేరు. ఈ రక్ష చేసికొనుటచే మానవుడు దుఃఖములు తొలగి సుఖము పొందును.
సచ్చిదానందస్వరూపుడును, పరమార్థభూతుడును, సర్వాంతర్యామియు, మహాత్ముడును, నిరాకారుడును, సహస్రాకారములు ధరించినవాడును, సర్వవ్యాపకుడును, అగు పరమాత్మకు నమస్కరించుచున్నాను. కల్మషరహితుడును, పరమశుద్ధుడును, నిత్యధ్యానయోగనిరతుడును అగు పరమాత్మకు నమస్కరించి రక్షావిషయమును చెప్పుచున్నాను. నా వాక్కు సత్య మగు గాక.
భగవంతుడైన వరాహమూర్తికిని, నృసింహునకును, వామనునకును నమస్కరించి రక్షావిషయమున చెప్పెదను. నా వాక్యము సిద్ధించుగాక. భగవతంతుడైన త్రివిక్రమునకును, శ్రీరామునకును, శ్రీమహావిష్ణువునకును, నరునకును నమస్కరించి నేను రక్షా విషయమున చెప్పుచున్నాను. అది సత్యమగు గాక.
ఓ వరాహస్వామీ! నృసింహేశ్వరా! త్రివిక్రమా! హయగ్రీవేశా! సర్వేశా! హృషీకేశా! నా నమస్త అశుభములను హరింపుము. ఎవ్వనిచేతను ఓడింపరాని ఓ పరమేశ్వరా! ఆకుంఠితశక్తి గల నీ చక్రావ్యాయుధములు నాలిగింటిచే సమస్తదుష్టుల సంహారము చేయుము. ఓ ప్రభూ! ఫలానావాని సంపూర్ణపాపములను హరించి ఆతనికి పూర్తిగ కుశలక్షేమము ను ప్రసాదించుము. పాపములవలన కలుగు మృత్యు, బంధన, రోగ, పీడా, భయాదులను తొలగింపుము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana - 94 🌹
✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj
Chapter 31
🌻 Mode of cleansing and Protection oneself and others - 1 🌻
Agni said:
1. I will now describe (the rite) known as the cleansing for the protection of one’s self and others, by which a man would become freed of miseries and get happiness.
2-3. Oṃ, salutations to the greatest object, the soul, the great soul, the formless and many-formed, the all-pervading, supreme soul, blemishless, pure and (person) engaged in meditative contemplation. Having saluted I shall expound. May my words prove true.
4. (Salutations) to the Boar, Man-lion and Dwarf (forms of Viṣṇu), the great sage. Having saluted I shall expound. May my words prove true.
5. (Salutations) to Trivikrama (a form of Viṣṇu, as he measured the three steps and removed the pride of the demon Bali), Rāma, Vaikuṇṭha (abode ofViṣṇu), the (Supreme) man. Having saluted I shall expound. May my words become true.
6. O Boar, Lord as Man-lion, Lord as Dwarf, Trivikrama, Hayagrīveśa (Lord as Horse-necked), Lord of all beings, Hṛṣīkeśa (Viṣṇu) (the Lord of all senses) destroy my impurity.
7. With these four most excellent weapons, the ever victorious disc and others of unbroken power, you become destroyer of all wicked things.
8. You remove the calamity of such a person and do (him) all good and also (remove) the fear of distress due to fetters of death which is the fruit of sins.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
Komentarze