🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 97 / Agni Maha Purana - 97 🌹
✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ
శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.
ప్రథమ సంపుటము, అధ్యాయము - 31
🌻. అపామార్జన (ఆత్మ రక్షణ ) విధానము - 4 🌻
స్థావరము, జంగమము, కృత్రిమము, దంతములందు పుట్టినది, నఖములందు పుట్టినది, అకాశమునందు పుట్టినది, సాలెపురుగు మొదలగువాటినుండి పుట్టినది, ఇంకను ఇతరవిధములైన దుఃఖకర మగు విషమును భగవంతుడైన వాసుదేవుని స్మరణము నశింపచేయుగాక. బాలకృష్ణుని చరిత్రముయొక్క కీర్తనము గ్రహ-ప్రేతగ్రహ-డాకినీ పూతనాది గ్రహ-వినాయకగ్రహ - ముఖమండికా - క్రూరరేవతీ - వృద్ధరేవతీ - వృద్ధికానామకోగ్రగ్రహ - మాతృగ్రహాదులగు బాలగ్రహములను నశింప చేయుగాక!
భగవంతుడ వైన నరసివంహా! నీ దృష్టిప్రసారముచే బాలగ్రహములు, యువగ్రహములు, వృద్ధగ్రహాములు దగ్ధము లైపోవుగాక! జూలుతో భయంకర మైన ముఖము కలవాడును, లోకమునకు హితము చేకూర్చువాడును, మహాబలవంతుడును అగు భగవంతు డైన నృసింహుడు సమస్తబాలగ్రహములను నశింపచేయుగాక, ఓ నరసింహా! మహాసింహా! జ్వాలామాలలచే నీ ముఖమండలము ప్రకాశించుచున్నది. ఓ అగ్ని లోచనా! సర్వేశ్వరా! సమస్తగ్రహములను భక్షించుము! భక్షించుము.
పరమాత్ము డైన జనార్దనుడు సర్వాత్మస్వరూపుడు. ఓ వాసుదేవా! ఈ వ్యక్తియందు ఏ రోగములన్నవో, ఏ మహోత్పాతము లున్నవో, ఏ విషమున్నదో, ఏ మహాగ్రము లున్నవో, క్రూరభూతము లున్నవో, దారుణ మైన గ్రహపీడ లున్నవో వాటి నన్నింటిని ఏదియో ఒక రూపము ధరించి నశింపచేయుము. దేవశ్రేష్ఠుడ వైన అచ్యుతా! జ్వాలామాలలచే మిక్కిలి భయంకరమైన సుదర్శనచక్రమును ప్రయోగించి దుష్టరోగలముల నన్నింటిని నశించేయుము.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana - 97 🌹
✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj
Chapter 31
🌻 Mode of cleansing and Protection oneself and others - 4 🌻
27-28. On his (name) being recited, may Janārdana destroy the poisons of animate and inanimate objects, as well as artificially made, those caused by teeth, by nails and those arising from the sky as well as those caused by (insects like) spider and others which cause grief.
29-31. May the life of boyhood of Viṣṇu (Kṛṣṇa) destroy the evil forces which afflict mothers and children,. such as, planets, evil spirits, female goblins, vampires, ghosts, gandharvas, yakṣas, demons, the impeding forces such as Śakuni, Pūtanā and others, (the female forces such as) Mukhamaṇḍī, Revatī and the terrible Vṛddharevatī, and the fierce forces known as Vṛddhaka.
32. May these evil forces which afflict at the old age, and the children and the youth be scorched by the looks of the Manlion.
33. May the dreadful face of the Man-lion of enormous strength destroy these evil forces completely for the welfare of the world.
34. O Man-lion, O Great lion, possessor of garland of flames, Fiery-mouthed, Possessor of fiery eyes, Lord of all, devour the evil forces completely.
35-37. May the Lord of all (beings), Supreme Lord, Janārdana destroy diseases, great portents, poisons, great evil forces, the fierce beings, the afflictions due to the planets whichever is cruel, the injuries caused by weapons, and jvālāgardabhaka[3] etc., assuming any one of the forms of Vāsudeva and hurling the Sudarśana disc which is dreadful like a garland of fire.. O Acyuta, the foremost among gods (you) destroy the evil. forces.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
Comments