top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ మదగ్ని మహాపురాణము - 98 / Agni Maha Purana - 98


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 98 / Agni Maha Purana - 98 🌹


✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ


శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.


ప్రథమ సంపుటము, అధ్యాయము - 31



🌻. అపామార్జన (ఆత్మ రక్షణ ) విధానము - 5 🌻


తీవ్రజ్వాలలచే ప్రకాశించుచు, మహాధ్వని చేయుచున్న సుదర్శనచక్రమా! సమస్తదుష్టరాక్షసులను సంహరింపుము; సంహరింపుము. నీ ప్రభావముచే ఆ రాక్షసు లందరును నశింతురుగాక. సర్వాత్మకు డగు నృసింహుడు, తన గర్జనముచే, పూర్వ-పశ్చిమ-ఉత్తర-దక్షిణదిశలందు రక్షించుగాక.


అనేక రూపములను ధరించు భగవంతుడైన జనార్దనుడు స్వర్గలోక-భూలోక-అంతరిక్షములందును, ముందును, వెనుకను రక్షించుగాక. దేవాసుర మనుష్యసహిత మగు ఈ జగత్తు అంతుయు భగవంతు డగు విష్ణుయొక్క స్వరూపమే. ఈ సత్యముయొక్క ప్రభావముచే ఈతని దుష్టరోగము లన్నియు నశించుగాక.


''విష్ణువును స్మరింపగనే సర్వపాపములును వెంటనే తొలగిపోవును'' అను సత్యముయొక్క ప్రభావముచే వీని దుష్టరోగము లన్నియు శాంతించుగాక. ''యజ్ఞేశ్వరుడైన విష్ణువు దేవతలచే ప్రశంసించబడుచున్నాడు'' అనెడు సత్యముయొక్క ప్రభావముచే నా మాట సత్య మగుగాక. శాంతి కలుగుగాక. మంగల మగుగాక. ఈతని దుష్టరోగములు నశించుగాక.


భగవంతుడైన వాసుదేవుని శరీరమునుండి పుట్టిన కుశలచే నేను ఈతని రోగములను తొలగించితిని. నరనారాయణులు, గోవిందుడును వీనికి అపామార్జనము చేయుగాక. శ్రీహరి వచనము ప్రకారము ఈతని సంపూర్ణదుఃఖములు శమించుగాక. సమప్తరోగాదులను నివారించుటకు అపామార్జనస్తోత్రము ప్రశస్త మైనది. నేను శ్రీహరిని. నేను నీ రోగములను నశింపచేసితిని.


అగ్నిమహాపురాణమునందలి కేశాపామార్జనస్తోత్రవర్ణన మను ముప్పదియొకటవ అధ్యాయము సమాప్తము.



సశేషం....


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Agni Maha Purana - 98 🌹


✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj


Chapter 31


🌻 Mode of cleansing and Protection oneself and others - 5 🌻


38. O Sudarśana, the huge fire and great sound (you) destroy (all evils). O Vibhīṣaṇa (one who frightens)! may all the evil demons get destroyed.


39. May the Man-lion (deity), the soul ofall beings, possessing terrific roars protect me in the east, west, south and north.


40. May Lord Janārdana of manifold forms protect me in heavens, on the earth, in the sky, behind me, on the sides and in front of me.


41. As Viṣṇu (protects) the entire universe (consisting of) the celestials, demons and mortals, may the evils of this person be put down by that truth.


42. As the sins get destroyed at once by the remembrance of Viṣṇu, may all evil of this person get destroyed by that truth.


43. As the Supreme Lord Viṣṇu has been extolled in the vedānta (the philosophical inquiry is known as it forms the concluding portion of the Vedas) may all the evils of this person get destroyed by that truth.


44. As Viṣṇu, the lord of sacrifices is exolled [extolled?] among the celestials, may what all has been uttered by me become so by that truth.


45-46. May there be peace. May there be good. May the evil of this man get destroyed, being agitated by me with the kuśa (grass) originating from the body of Vāsudeva. May Govinda, the Nara-Nārāyaṇa[4] cleanse me. May there be remo, 1 of all miseries by the chant (of the names) of Hari in the same manner.


47. This is the weapon which cleans and which wards off all diseases. I am Hari. The kuśa grass is Viṣṇu. Your diseases have been destroyed by me.



Continues....


🌹 🌹 🌹 🌹 🌹



23 Aug 2022

Comments


Post: Blog2 Post
bottom of page