top of page
Writer's picturePrasad Bharadwaj

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 374 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 374 - 2 🌹





*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 374 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 374 - 2 🌹* *🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻* *✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్* *సేకరణ : ప్రసాద్ భరద్వాజ* *మూల మంత్రము :* *🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁* *🍀 82. కామేశ్వర ప్రాణనాడీ, కృతజ్ఞా, కామపూజితా ।* *శృంగార రససంపూర్ణా, జయా, జాలంధరస్థితా ॥ 82 ॥ 🍀* *🌻 374 -2. 'కృతజ్ఞా'🌻* *శ్రీమాత కూడ శివుని ఇచ్ఛ వలనే తాను గెలుచు చున్నట్లు తెలిసి సంతసించెడిదట. శివుడి ఆజ్ఞ లేనిదే శ్రీమాత ఎట్లు గెలువగలదు? ఇట్లు శ్రీమాత కృతజ్ఞా భావమును కవులు ప్రశంసించు చుందురు. 'కృతజ్ఞ' అనగా జరిగిన మేలు మరువకుండుట అని కూడ అర్థము కలదు. మేలు జరిగినపుడు మేలు చేసినవారిని కృతజ్ఞ. భావముతో హృదయమున ప్రశంసించినచో శ్రీమాత అనుగ్రహించును. శ్రీరాము డట్టివాడు. చిన్న ఉపకారము తనకెవ్వరైన చేసినచో దానిని మిక్కిలి ప్రశంసించెడివాడు. అట్లు ప్రశంసించుట రాముని కల్యాణ గుణములలో ప్రథమమైనది.* *గుహుడు, జటాయువు, శబరి, విభీషణుడు, సుగ్రీవుడు మొదలగు వారందరి యెడల రాముని కృతజ్ఞతా భావము నిరుపమానము. సాటిలేనిది. ఇట్టి కృతజ్ఞతాభావ రూపమున శ్రీమాతయే రాముని నుండి వారందరికి చల్లని స్పర్శ నిచ్చెడిది. 'కృతజ్ఞ' అనగా కృత యుగమందలి జ్ఞానమని కూడ అర్థమున్నది. కృతయుగ మందు జ్ఞానము పరిపూర్ణముగ యుండెడిది. ధర్మము నాలుగు పాదముల నడిచెడిది. పరిపూర్ణ జ్ఞాను లగుటచే జీవులు పూర్వ జన్మములను కూడ ఎఱిగి యుండెడివారు.* *సశేషం...* 🌹 🌹 🌹 🌹 🌹 *🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 374 -2 🌹* *Contemplation of 1000 Names of Sri Lalitha Devi* *✍️. Acharya Ravi Sarma * *📚. Prasad Bharadwaj* *🌻 82. Kameshari prananadi krutagyna kamapujita* *Shrungararasa sanpurna jaya jalandharasdhita ॥ 82 ॥ 🌻* *🌻 374-2. Kṛtajñā कृतज्ञा🌻* *In other words when one performs his karmas without expecting anything in return, pleased with his selfless nature, She imparts the Supreme knowledge (knowledge of the Brahman). In Viṣṇu Sahasranāma 82 is Kṛtajñā.* *Cāndogya Upaniṣahad (IV.iii.8) says, Prāṇa, speech, the eyes, the ears and the mind – these five represent our physical self (ādhyātimka). Air, fire, sun, moon and water represent Nature (ādhidaivika) that surround us. The ten together are to the dice throw called kṛta.* *Continues...* 🌹 🌹 🌹 🌹 🌹 #శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama #PrasadBhardwaj https://t.me/+LmH1GyjNXXlkNDRl http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/ https://dailybhakthimessages.blogspot.com https://www.facebook.com/103080154909766/ https://incarnation14.wordpress.com/

Comments


Post: Blog2 Post
bottom of page