top of page
Writer's picturePrasad Bharadwaj

🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 374 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 374 - 3 🌹


*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 374 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 374 - 3 🌹* *🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻* *✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్* *సేకరణ : ప్రసాద్ భరద్వాజ* *మూల మంత్రము :* *🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁* *🍀 82. కామేశ్వర ప్రాణనాడీ, కృతజ్ఞా, కామపూజితా ।* *శృంగార రససంపూర్ణా, జయా, జాలంధరస్థితా ॥ 82 ॥ 🍀* *🌻 374 -3. 'కృతజ్ఞా'🌻* *కృత యుగమున శ్రీమాత జ్ఞాన స్వరూపిణిగ పరిపూర్ణముగ దర్శనమిచ్చు చుండెడిది. అటు తరువాత యుగములలో జ్ఞానము అజ్ఞానముచే కప్పబడుటచే దైవమున్నాడన్న భావము కూడ ప్రస్తుతము మృగ్యమై యున్నది. అజ్ఞానము వలన అహంకారమునబడిన జీవులు శ్రీమాత ఆరాధనము ద్వారా మరల క్రమముగ జ్ఞానమును పొందగలరు.* *శ్రీమాత జీవులందరిని సూర్యుడు, చంద్రుడు, యముడు, కాలము, పంచ మహాభూతముల రూపమున గమనించు చుండునట. పై తెలిపిన తొమ్మిది మందిని లోక సాక్షులుగ పేర్కొందురు. ఈ లోక సాక్షుల ద్వారా జీవులు చేయుచున్న పాప పుణ్యములను గమనించుచు తదనుగుణమైన ఫలముల నిచ్చుచుండును. ఉపకారము చేయువారికి ఉపకారము చేయును. అపకారము చేయువారికి అపకారము చేయును. అపకారము చేసిననూ, ఉపకారము చేయువారిని అనుగ్రహించును. అనగా విశేషముగ ఉపకారము చేయును. ఇట్లు 'కృతజ్ఞ' అను శ్రీమాత నామమునకు వివిధములగు భాష్యము లున్నవి.* *సశేషం...* 🌹 🌹 🌹 🌹 🌹 *🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 374 -3 🌹* *Contemplation of 1000 Names of Sri Lalitha Devi* *✍️. Acharya Ravi Sarma * *📚. Prasad Bharadwaj* *🌻 82. Kameshari prananadi krutagyna kamapujita* *Shrungararasa sanpurna jaya jalandharasdhita ॥ 82 ॥ 🌻* *🌻 374-3. Kṛtajñā कृतज्ञा🌻* *It is also said that ādhyātimka and ādhidaivika together represent the universe and hence is known as Virāt (the Supreme Intellect located in a supposed aggregate of gross bodies). Living beings are known as ādhibautika.* *In terms of Cāndogya Upaniṣahad (IV.i.4) Kṛtajñā means a person who includes within himself all the good things that other people do. He is the sum total of all good things in the world.* *Continues...* 🌹 🌹 🌹 🌹 🌹 #శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama #PrasadBhardwaj https://t.me/+LmH1GyjNXXlkNDRl http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/ https://dailybhakthimessages.blogspot.com https://www.facebook.com/103080154909766/ https://incarnation14.wordpress.com/

Comments


Post: Blog2 Post
bottom of page