*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 375 / Sri Lalitha Chaitanya Vijnanam - 375 🌹* *🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻* *✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్* *సేకరణ : ప్రసాద్ భరద్వాజ* *మూల మంత్రము :* *🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁* *🍀 82. కామేశ్వర ప్రాణనాడీ, కృతజ్ఞా, కామపూజితా ।* *శృంగార రససంపూర్ణా, జయా, జాలంధరస్థితా ॥ 82 ॥ 🍀* *🌻 375. 'కామపూజితా'🌻* *మన్మథునిచే పూజింపబడునది శ్రీదేవి అని అర్థము. మన్మథుడు లక్ష్మీదేవి పుత్రుడు. అతి మనోహరమైన రూపము గలవాడు. సృష్టి కామమునకు అతడు అధిదేవత. స్త్రీ పురుష కామమునకు ప్రతిరూపము. కామప్రేరణ ద్వారా మనస్సులయందు మథనము చేయువాడు. సతీదేవి దక్ష యజ్ఞమున ఆహుతి చెంది పార్వతిగ మరల పుట్టి శివుని గూర్చి ఘోర తపస్సు కావించినపుడు ఆమెకు తోడ్పడవలెనన్న అభిలాషతో ఈశ్వరునికై తన శక్తిని ప్రయోగింపగ ఈశ్వరుడు కన్ను తెరచి చూసుసరికి అతడు భస్మరాశి అయ్యెను.* *అటుపైన పార్వతీదేవి తపస్సు ద్వారా ఈశ్వరుని మెప్పించి అతనిని పరిణయమాడినది. పిదప భస్మరాశిగ మిగిలియున్న కాముని అనుగ్రహించి సజీవుని చేసెను. ‘కామ సంజీవ నౌషధిః' అను నామమున ఇది పేర్కొనుట జరిగినది. శ్రీమాతచే సజీవుడైన మన్మథుడు అటుపైన శ్రీదేవి నుండి పంచదశాక్షరి మంత్రమును ఉపదేశముగ పొందినాడు. ఆ మంత్రమును ఉపాసించుచు జీవుల లింగ శరీరముల నధిష్ఠించి సృష్టి కార్యమును నిర్వర్తించు చున్నాడు. కామునిచే నిత్యము శ్రీమాత పూజింప బడుచున్నది. కావున 'కామ పూజిత' అయినది.* *సశేషం...* 🌹 🌹 🌹 🌹 🌹 *🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 375 🌹* *Contemplation of 1000 Names of Sri Lalitha Devi* *✍️. Acharya Ravi Sarma * *📚. Prasad Bharadwaj* *🌻 82. Kameshari prananadi krutagyna kamapujita* *Shrungararasa sanpurna jaya jalandharasdhita ॥ 82 ॥ 🌻* *🌻 375. Kāma-pūjitā काम-पूजिता🌻* *She is worshipped by the lord of love Manmatha. We have seen earlier that She is worshipped by twelve gods and godlessness, sages and saints through Her supreme Pañcadaśī mantra and Manmatha is one among the twelve (refer nāma 239).* *Manmatha is also known as Kāma and the worship by Kāma is called Kāma-pūjitā. 586th nāma is Kāma-sevitā.* *Continues...* 🌹 🌹 🌹 🌹 🌹 #శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama #PrasadBhardwaj https://t.me/srilalithachaitanyavijnanam http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/ https://dailybhakthimessages.blogspot.com https://www.facebook.com/103080154909766/ https://incarnation14.wordpress.com/ https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages https://chaitanyavijnanam.tumblr.com/
top of page
bottom of page
コメント