top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 377 / Sri Lalitha Chaitanya Vijnanam - 377


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 377 / Sri Lalitha Chaitanya Vijnanam - 377 🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :


🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 82. కామేశ్వర ప్రాణనాడీ, కృతజ్ఞా, కామపూజితా ।

శృంగార రస సంపూర్ణా, జయా, జాలంధరస్థితా ॥ 82 ॥ 🍀


🌻 377. 'జయా' 🌻


జయము శ్రీమాత రూపము అని అర్థము. జయము ఎవరికి కలిగిననూ అది శ్రీమాత అనుగ్రహమే. శ్రీమాత తన భక్తులకు జయము కలిగించుటకై ఎల్లప్పుడునూ సంసిద్ధురాలై యుండును. తన భక్తులకు జయము కలుగుటకు శ్రీమాత తానే స్వయముగ విఘ్నము లన్నిటినీ తొలగించును. ఆపదలను నివారించును. సంపదలు ప్రసాదించును.


తన భక్తుల జయము తన జయముగ సంతసించును. భక్తులు ఆనందించు చుండుగ చూచి తానునూ ఆనందమును పొందును. అవసరమగుచో పర్వత మంత కర్మలను కూడ వరాహ స్వరూపిణియై పెళ్ళగించి ఆనందము ప్రసాదించును. శ్రీమాత ఆరాధనము భక్తి శ్రద్ధలతో గావించువారు అనంతమగు సంసార సముద్రమును ఆనంద మను పడవనెక్కి సాగుదురు. శ్రీమాత భక్తులకు అపజయమే లేదు.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 377 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️. Acharya Ravi Sarma

📚. Prasad Bharadwaj



🌻 82. Kameshari prananadi krutagyna kamapujita

Shrungararasa sanpurna jaya jalandharasdhita ॥ 82 ॥ 🌻


🌻 377. Jayā ज़या 🌻


She remains victorious. She is the embodiment of victory. Possibly this could also indicate that Her victorious form can be realized only if one wins over his senses. Senses are considered as the worst enemies to Self realization as the mind gets corrupted due to their evil influence.


But, if the mind is conditioned, such evil influences will not cause any affliction to its serenity. Viṣṇu Sahasranāma 509 is Jayā and the interpretation given is ‘the one who wins over all lives’.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹

Comentarios


Post: Blog2 Post
bottom of page