top of page

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 378-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 378-1

Writer's picture: Prasad BharadwajPrasad Bharadwaj


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 378-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 378-1 🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :


🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 82. కామేశ్వర ప్రాణనాడీ, కృతజ్ఞా, కామపూజితా ।

శృంగార రస సంపూర్ణా, జయా, జాలంధరస్థితా ॥ 82 ॥ 🍀


🌻 378-1. 'జాలంధర స్థితా’ 🌻


జాలంధర మను పీఠము నందు ఉండునది శ్రీమాత అని అర్థము. శ్రీదేవి జలంధర మను పీఠమును విష్ణుముఖి అను పేరుతో పూజింపబడు చున్నట్లుగా పద్మ పురాణమున పేర్కొనబడినది. జాలంధర మనగా ఇంద్రజాల మహేంద్రజాలములతో కూడిన మంద్రజాలము. మంద్రజాల మనగా చైతన్యమునుండి ఏర్పడిన లోకాలోకముల వల లేక శ్రీదేవి మాయావరణములు. సృష్టి యందు విష్ణువు మాయావి అని ప్రసిద్ధి గాంచెను. శ్రీమాతయే శ్రీమహావిష్ణువు. అందువలన ఆమె 'విష్ణుముఖి' అని పిలువబడుచున్నది. దుష్టులకు మాయ కలిగించుట, శిష్టులకు మాయ తొలగించుట శ్రీమాత జాలము.


అట్టి జాలమును ధరించి యుండును గనుక 'జాలంధరి' అని ప్రసిద్ధి గాంచినది. లీలాప్రాయముగ తన జాలమును ప్రయోగించుట, మరల తొలగించుట చేయుచు నుండును. త్రిమూర్తులు సహితము ఆమె సృష్టి జాలమును అవగాహన చేసికొనలేరు. కేవలము పరతత్త్వమునకే అవగాహన యగును. శ్రీదేవి మాయాజాలముతో గూడిన అసురు డొక డుండె నని, అతని పేరు జలంధరు డని, ఆ జలంధరుడు ఇంద్రుని, విష్ణువుని కూడ తన జాలముతో జయించి బంధించె నని, అటుపైన పరమశివుడు అతనిని జయించి విష్ణుని, ఇంద్రుని రక్షించే నని పద్మపురాణము పేర్కొనుచున్నది.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 378 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️. Acharya Ravi Sarma

📚. Prasad Bharadwaj


🌻 82. Kameshari prananadi krutagyna kamapujita

Shrungararasa sanpurna jaya jalandharasdhita ॥ 82 ॥ 🌻


🌻 378. Jālandhara-sthitā जालन्धरा-स्थिता 🌻


A reference is invited to jālandhara pīṭha or the heart cakra, where the sound is further refined, to become madhyama, the penultimate stage of sound before its actual delivery. This is one of Her Śabda Brahman forms.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹



08 Jun 2022

Comments


Post: Blog2 Post

©2022 by DailyBhaktiMessages. Proudly created with Wix.com

  • Facebook
  • Twitter
  • LinkedIn
bottom of page