top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 378-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 378-2



🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 378-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 378-2 🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :


🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 82. కామేశ్వర ప్రాణనాడీ, కృతజ్ఞా, కామపూజితా ।

శృంగార రస సంపూర్ణా, జయా, జాలంధరస్థితా ॥ 82 ॥ 🍀


🌻 378-2. 'జాలంధర స్థితా’ 🌻


ఇందలి రహస్య మేమనగా జలంధరుడు శ్రీమాత జాలము. ఆ జాలము నెఱిగినవాడు ఆమె గాక పరమ శివుడొక్కడే అని అర్థము. శ్రీమాత ఈ జాలము వలననే జీవులు మాయకు లోనై తాము ఇతరులు అన్న భావముతో పరస్పరత్వమున అనేకానేక అనుభూతులను చెందుచున్నారు. మనయందు జలపీఠమైన మణిపూరకమును అధిష్ఠించి శ్రీమాత యున్నది. ముందు నామమున హృదయ పీఠము తెలుపబడినది.


ఈ నామమున మణిపూరక పీఠము నందున్న 'జాలంధరీదేవి'గా శ్రీమాత వర్ణింపబడినది. నీరు కారణముగ వున్నది వక్రస్థితి చెందుట, కదలనిది కదలుచున్నట్లుగ కనబడుట ఇత్యాదివి జరుగును కదా! మనస్సు యందు కలుగు భ్రమలకు, భ్రాంతులకు, అపోహలకు కారణము జాలంధర పీఠమున ప్రజ్ఞ నిలచి యుండుటయే. చంచల మనస్కులందరూ ఇందే బంధింపబడి యుందురు. జాలంధరీ దేవిని తెలిసి పూజించినవారు ఈ అవస్థితిని శ్రీమాత అనుగ్రహముచే దాటుదురు.


సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 378 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️. Acharya Ravi Sarma

📚. Prasad Bharadwaj


🌻 82. Kameshari prananadi krutagyna kamapujita

Shrungararasa sanpurna jaya jalandharasdhita ॥ 82 ॥ 🌻


🌻 378. Jālandhara-sthitā जालन्धरा-स्थिता 🌻


A reference is invited to jālandhara pīṭha or the heart cakra, where the sound is further refined, to become madhyama, the penultimate stage of sound before its actual delivery. This is one of Her Śabda Brahman forms.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹

Commentaires


Post: Blog2 Post
bottom of page