🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 379-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 379-1 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 83. ఓడ్యాణ పీఠనిలయా, బిందుమండల వాసినీ ।
రహోయాగ క్రమారాధ్యా, రహస్తర్పణ తర్పితా ॥ 83 ॥ 🍀
🌻 379. ‘ఓడ్యాణ పీఠనిలయా' - 1🌻
ఓడ్యాణ పీఠము నివాస స్థానముగా గలది శ్రీమాత అని అర్థము. హృదయ పీఠము, జాలంధర పీఠము తర్వాతి పీఠముగా ఓడ్యాణ పీఠము తెలుపబడినది. ఈ ఓడ్యాణమే తెనుగున వడ్డాణము అని పిలువబడుచున్నది. స్త్రీలు వడ్డాణమును, పురుషులు కటి బంధమును ధరించుట సనాతనమగు ఆచారము. కటిబంధము యొక్క బలమే శరీర బలముగ తెలియవలెను. కటిబంధము సడలినపుడు శరీరము అదుపు తప్పును. రోగగ్రస్త మగును.
శరీరము యొక్క అధోభాగము బలముగ నుండవలె నన్నచో నడుము సన్నదిగను, బలముగను ఉండ వలయును. యోగమున ఆసనములన్నియూ కటిభాగము స్థిమితముగను, బలముగను స్థిరపరచుటకే. ఈ భాగము విస్తరించినచో యోగమునకు అర్హత కోల్పోవుట జరుగును. ఓడ్యాణ బంధము నడ్డి పదునుగను, నిటారుగను వుండుటకు, పొత్తికడుపు పెరుగకుండటకు వినియోగ పడును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 379 - 1🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 83. Odyana pita nilaya nindu mandala vasini
Rahoyaga kramaradhya rahastarpana tarpata ॥ 83 ॥ 🌻
🌻 379. Oḍyāṇa-pīṭha-nilayā ओड्याण-पीठ-निलया - 1 🌻
She abides in the oḍyāṇa-pīṭha, the fourth pīṭha of the gross body. The fully developed sound at this stage is delivered in the form of vaikari. The oḍyāṇa-pīṭha, corresponds to the throat cakra or viśuddhi.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comments