top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 380-3 / Sri Lalitha Chaitanya Vijnanam - 380-3



🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 380-3 / Sri Lalitha Chaitanya Vijnanam - 380-3 🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :


🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 83. ఓడ్యాణ పీఠనిలయా, బిందుమండల వాసినీ ।

రహోయాగ క్రమారాధ్యా, రహస్తర్పణ తర్పితా ॥ 83 ॥ 🍀



🌻 380. 'బిందుమండలవాసినీ' - 3🌻


జీవితము యజ్ఞార్థము కానిచో తపస్సు వలను పడదు. అంతరాంత రాళమున జీవప్రజ్ఞ చేరవలె నన్నచో ఇతరములు గోచరింపక సమస్తము శ్రీమాత దివ్యరూపముగనే దర్శించుట ప్రధానము. అపుడు శ్రీమాత భావన నిత్యమగును. అనన్యమగును. బిందు మండల మనగా తెల్లని కాంతితో కూడిన మండలము. ఆ కాంతికి కేంద్రమే బిందువు. ఈ బిందువు గాని, దాని కాంతి గాని, పదార్థమును ఆవరించి యుండును గాని ఆశ్రయించి యుండదు. బిందువు రూపము పూర్ణమగుట వలన దీనిని పూర్ణ మనిరి. తేజోవంత మగుట వలన చీకటికి ఆవలి వెలుగు అనిరి. దీనిని స్మరించుటకే భ్రూమధ్యమున స్త్రీలు, పురుషులు తిలక ధారణము గాని భస్మ ధారణము గాని చేయుట.


మాధవు డుండు స్థానము అయి వుండుటచే ఈ భ్రూమధ్య స్థానమును బిందు మాధవు డని, బిందు మాధవి అని పలుకుదురు. భ్రూమధ్యము నుండి బ్రహ్మనాళమున చరించుట బ్రహ్మానంద దాయకము. హృదయ మందు విశాలమై పరమ పవిత్రమైన ప్రజ్ఞగ ప్రవహించు చుండును గనుక బిందు హ్రదము (సరస్సు) అని కూడ పలుకుదురు. బిందు స్థానమున చేరిన వారిని బిందు శర్మ అని పిలుతురు. నాళమున ఈ బిందువు అన్ని లోకముల యందు పయనించు త్రోవను బిందురేఖ అనిరి. బిందు జ్ఞానమే సర్వజ్ఞానము, సర్వానందమయము.

సశేషం... 🌹 🌹 🌹 🌹 🌹 🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 380 - 3 🌹 Contemplation of 1000 Names of Sri Lalitha Devi ✍️. Acharya Ravi Sarma 📚. Prasad Bharadwaj 🌻 83. Odyana pita nilaya nindu mandala vasini Rahoyaga kramaradhya rahastarpana tarpata ॥ 83 ॥ 🌻 🌻 380. Bindumaṇḍala-vāsini बिन्दुमण्डल-वासिनि - 3 🌻 The bindu is also referred to the orifice in the sahasrāra also known as brahmarandhra through which commune with God is established. The cosmic energy enters the human body only through this orifice in the crown cakra and medulla in the back head cakra. When these two places are exposed to Mother Nature and early morning sun, sufficient cosmic energy can be drawn by the gross body to have a disease free life. Continues... 🌹 🌹 🌹 🌹 🌹

Commentaires


Post: Blog2 Post
bottom of page