top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 382-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 382-1




🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 382-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 382-1 🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :


🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁



🍀 83. ఓడ్యాణ పీఠనిలయా, బిందుమండల వాసినీ ।

రహోయాగ క్రమారాధ్యా, రహస్తర్పణ తర్పితా ॥ 83 ॥ 🍀


🌻 382. 'రహస్తర్పణ తర్పితా' - 1🌻


ఏకాంతముగ పరమాత్మ తత్త్వము నెరింగి అంతరంగమున ప్రవేశించి రహస్యమున తనను తా నర్పించుకొని తన్మయము చెందు నది శ్రీదేవి అని అర్థము. తర్పణము అర్పణమే. అర్పణ తలమానికమగు గుణము. జీవితము తనదిగా కాక దైవమునది అని ఎఱిగి దైవమున కర్పించి జీవించుట నిజమగు సాధన. అది అత్యంత సాహసవంతము. దైవము కొరకే జీవించుట, దైవమునే ఆశ్రయించి యుండుట, దైవార్పితముగ జీవితము గడుపుట, సమస్తమునకు దైవమే ఉపాయమని భావించుట, ఆరాధించుట, దైవము దరిచేరుట, సంపూర్ణముగ తన మాన ప్రాణములతో సహా దైవమున కర్పణ చేయుట అర్పణ మార్గము.


సమర్పణ మనగ నిదియే. ఇట్టి సమర్పణ అత్యంత రహస్యముగ నిర్వర్తించుకొనుట రహస్యార్పణ మగును. 'రహస్తర్పణ' మగును. అట్లు అర్పించు కొన్నవారి జీవితము నిరహంకారమై, దైవమున కత్యంత చేరువై, దైవానుగ్రహము నకు పాత్రమై నిలచును. అప్పుడు దైవ మందించు సాన్నిధ్యము పరిపూర్ణానందమును కలిగించి పరితృప్తి కలిగించును.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 382 - 1 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️. Acharya Ravi Sarma

📚. Prasad Bharadwaj


🌻 83. Odyana pita nilaya nindu mandala vasini

Rahoyaga kramaradhya rahastarpana tarpata ॥ 83 ॥ 🌻


🌻 382. Rahastarpaṇa-tarpitā रहस्तर्पण-तर्पिता -1 🌻


In the initial stage of pursuing spiritual path and in order to control the mind, recitation and repetition of mantra-s is practiced, so that the mind does not get diverted to extraneous thoughts. Such mantra-s should be recited after understanding the meaning of the mantra.


In the case of Pañcadaśī mantra, there are fifteen bīja-s in that mantra and each bīja has different meaning and significance. This has been dealt with in the introductory chapter. Two things are important while reciting a mantra. The first one is dhyāna verse or the meditative verse that describes the form of the god or goddess. This helps in visualizing the form of the deity.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹



Comments


Post: Blog2 Post
bottom of page