top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 383 / Sri Lalitha Chaitanya Vijnanam - 383



🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 383 / Sri Lalitha Chaitanya Vijnanam - 383 🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :


🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁



🍀 83. ఓడ్యాణ పీఠనిలయా, బిందుమండల వాసినీ ।

రహోయాగ క్రమారాధ్యా, రహస్తర్పణ తర్పితా ॥ 83 ॥ 🍀


🌻 383. 'సద్యః ప్రసాదినీ'🌻


రహోూయాగము, రహస్తర్పణము జరుపువారిని అప్పటి కప్పుడు అనుగ్రహించునది శ్రీమాత. ‘ప్రసాద’ మనగా దేవి అనుగ్రహము. 'సద్యో' యనగా అప్పటి కప్పుడు అని అర్థము. 'సద్యః ప్రసాదిని' అనగా వెంటనే అనుగ్రహించు నది. రహోూయాగము, రహస్తర్పణము అనునవి ముందు నామము లలో తెలుపబడినది. వాటిని నిర్వర్తించుకొనువారు శ్రీమాత అనుగ్రహమునకు పాత్రు లగుదురు. అట్టివారి యందు శ్రీమాత మిక్కిలి ప్రసన్నురాలై యుండును. ఎప్పటి కప్పుడు వారిని రక్షించుకొను చుండును.


వారి యందు తన సాన్నిధ్యమును శాశ్వతముగ నిలుపును. తన వైభవము వారి వైభవముగ లోకములందు విస్తరింప చేయును. అమ్మ అనుగ్రహము ఇట్టిది అని తెలుపుట సాధ్యపడు విషయము కాదు. ఊహ కందని అనుగ్రహమును తన భక్తుల యెడల అప్రమత్తమై ప్రసరింప జేయును. తనకు సమర్పణ చెందినవారికి తన సాన్నిధ్య మిచ్చి, పరిపూర్ణమగు దివ్యవైభవమును ప్రసాదించును. ప్రసాద మనగా దైవమునకు సమర్పణ చేయబడి దైవముచే అనుగ్రహింపబడి దైవ ప్రతీకగా నిలచి యుండుట. అమ్మ భక్తులు, కృష్ణ భక్తులు అట్టివారు.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 383 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️. Acharya Ravi Sarma

📚. Prasad Bharadwaj


🌻 83. Odyana pita nilaya nindu mandala vasini

Rahoyaga kramaradhya rahastarpana tarpata ॥ 83 ॥ 🌻


🌻 383. Sadyaḥ-prasāidinī सद्यः-प्रसादिनी 🌻


She bestows Her grace immediately for those who seek Her within. This has been discussed in the two previous nāma-s. By such internal worship, Her immediate grace is imminent.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹



Comments


Post: Blog2 Post
bottom of page