top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 384 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 384 - 2



🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 384 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 384 - 2🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :


🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁



🍀 84. సద్యఃప్రసాదినీ విశ్వసాక్షిణీ సాక్షివర్జితా

షడంగదేవతాయుక్తా షాడ్గుణ్యపరిపూరితా ॥ 84 ॥ 🍀


🌻 384. ‘విశ్వసాక్షిణీ' - 2🌻


విశ్వమంతటిని మరియు అందలి ప్రతి అణువు యందును తానే నిండియున్నది గనుక ఆమె గమనికను దాటి ఏదియూ యుండదు. ఇది ఆమె విశ్వ సాక్షిత్వము. సతతము బహిరంతరముల యందు తననే చూచుట నేర్చు భక్తులకు లోనుండి, వెలుపలినుండి కూడ తన సాక్షాత్కారము నిచ్చును. తన లోపల, వెలుపల చైతన్యమై నిలచి వివిధ రూపములతో, భావములతో, చేష్టలతో వర్తించు చున్నది శ్రీదేవియే అని తెలిసి చూచుట నిజమగు చూచుట. ఇతర చూపు లన్నియూ గ్రుడ్డివారి చూపులే.


చైతన్యమయి అయిన శ్రీమాతయే విశ్వరూపి. అందలి రూపము లన్నియూ ఆమెవే. వాని యందలి చేతన ఆమెయే. ఇట్లు తెలిసి దర్శించుచు ఆరాధించువారికి లోపల సాక్షాత్కార మిచ్చును. అటుపైన వెలుపల కూడ సాక్షాత్కారమిచ్చును. అట్టి వారికే అఖండమైన జ్ఞానము కలుగును.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 384 - 2 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️. Acharya Ravi Sarma

📚. Prasad Bharadwaj


🌻 84. Sadyah prasadini vishvasakshini sakshivarjita

Shadanga devata yukta shadgunya paripurita ॥ 84 ॥ 🌻


🌻 384. Viśva-sākṣinī विश्व-साक्षिनी 🌻


She is the witness of the universe. This is the unique quality of the Brahman without attributes, the supreme form of the Brahman. Only the Supreme Brahman stands as a witness to the happenings of the universe, without himself partaking in any of the activities.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹



Comments


Post: Blog2 Post
bottom of page