top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 385 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 385 - 1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 385 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 385 - 1🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :


🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁



🍀 84. సద్యఃప్రసాదినీ విశ్వసాక్షిణీ సాక్షివర్జితా

షడంగదేవతాయుక్తా షాడ్గుణ్యపరిపూరితా ॥ 84 ॥ 🍀


🌻 385. ‘సాక్షివర్జితా' - 1🌻


శ్రీమాతకు వేరొక సాక్ష్యము లేదు. కనుక ఆమె 'సాక్షివర్జిత’ అయినది. శ్రీమాతకు ముందున్నది తత్త్వమే. తత్త్వము నుండియే శివ శక్తు లుద్భవించినవి. అందువలన వారే లోకసాక్షులు. వారి నుండి దిగివచ్చినవారు వారిచే గమనింపబడు చుందురు. దిగివచ్చిన వారి నుండి తర తరములుగ దిగివచ్చినవారిని పరికించవచ్చును. సర్వ జీవులను సూర్యుడు, చంద్రుడు, యముడు, కాలము, పంచ భూతములు గమనించు చుండునని 374వ నామమున తెలుపబడినది. వారిని లోకసాక్షు లందురు.


వారికన్న క్రిందుగల లోకములను వారు సాక్షులై చూతురు. కాని వారిని కూడ గమనించునది, పరికించునది శ్రీమాత. క్రింది లోకములవారిని పై లోకములవారు దర్శించ గలరు. చీమ, దోమ, పురుగు మొదలగు జీవులు మనల నంతగ దర్శించవు. మనము వాటిని దర్శింతుము. అట్లే మనము దేవతల నంతగ దర్శింపము. కాని దేవతలు మనలను గమనించుచునే యున్నారు. వారు మనకన్న ఉన్నత లోకముల నున్నవారు. వారిలో కూడ శ్రేణులు గలవు.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 385 - 1 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️. Acharya Ravi Sarma

📚. Prasad Bharadwaj


🌻 84. Sadyah prasadini vishvasakshini sakshivarjita

Shadanga devata yukta shadgunya paripurita ॥ 84 ॥ 🌻


🌻 385. Sākṣivarjitā साक्षिवर्जिता🌻


But She is without witness. The existence of the Supreme form of the Brahman cannot be witnessed by anyone, as this form of the Brahman has no known source of origin. Another quality of the pure Brahman is referred here.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹

Comentarios


Post: Blog2 Post
bottom of page