top of page

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 385 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 385 - 2

Writer's picture: Prasad BharadwajPrasad Bharadwaj


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 385 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 385 - 2🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :


🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 84. సద్యఃప్రసాదినీ విశ్వసాక్షిణీ సాక్షివర్జితా

షడంగదేవతాయుక్తా షాడ్గుణ్యపరిపూరితా ॥ 84 ॥ 🍀


🌻 385. ‘సాక్షివర్జితా' - 2🌻


దేవతల నందరిని గమనించువాడు ఇంద్రుడు. అతడు దేవతలను పాలించువాడు కూడ. అతడిని కూడ గమనించువారు సప్త ఋషులు, కుమారులు, నారదుడు, త్రిమూర్తులు. వారిని కూడ గమనించునది శ్రీమాత. శ్రీమాత నెవ్వరునూ గమనించలేరు. ఆమె వ్యూహము ఎవ్వరికినీ తెలియదు. ఆమె సంకల్పించిన వెనుక బ్రహ్మర్షులకు, బ్రహ్మాదులకు తెలియును. ఇక ఆమె గమనమును, వ్యూహమును తెలియుట ఎట్లు? తెలియబడదు. కావున ఆమెను ఎవ్వరునూ సాక్షీభూతులై చూడలేరు. చూచుట, తెలియుట వంటి ప్రజ్ఞలు కూడ ఆమె నుండి ఏర్పడినవే.


కనుక అంతుబట్టని తత్త్వము శ్రీమాత. ఆమెను చేరవచ్చును గానీ ఆమె సర్వత్వమును, ఈశ్వరత్వమును గమనించలేరు. ఆమె కన్న పై స్థితిలో గలవారికే అది సాధ్యము. అట్టి వారెవ్వరునూ సృష్టిలో లేరు. శ్రీకృష్ణ తత్త్వము కూడ ఇట్టిదే. శ్రీకృష్ణుని చర్యలను గాని, ఊహలను గాని తెలిసినవారు అప్పటికినీ ఇప్పటికినీ లేరు. శ్రీకృష్ణుని మూలము శ్రీ లలితయే. శ్రీ లలితయైననూ, శ్రీకృష్ణుడైననూ ఒక్కటియే. దేవర్షి యగు నారదుడు కూడ వారి లీలలను తెలిసినపుడు ఆనందభరితుడై ధ్యానము చేయుచు నర్తించును.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹



🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 385 - 2 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️. Acharya Ravi Sarma

📚. Prasad Bharadwaj


🌻 84. Sadyah prasadini vishvasakshini sakshivarjita

Shadanga devata yukta shadgunya paripurita ॥ 84 ॥ 🌻


🌻 385. Sākṣivarjitā साक्षिवर्जिता 🌻


But She is without witness. The existence of the Supreme form of the Brahman cannot be witnessed by anyone, as this form of the Brahman has no known source of origin. Another quality of the pure Brahman is referred here.


Continues...


🌹 🌹 🌹 🌹 🌹



Comentários


Post: Blog2 Post

©2022 by DailyBhaktiMessages. Proudly created with Wix.com

  • Facebook
  • Twitter
  • LinkedIn
bottom of page