top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 386 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 386 - 1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 386 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 386 - 1🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :


🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁



🍀 84. సద్యఃప్రసాదినీ విశ్వసాక్షిణీ సాక్షివర్జితా

షడంగదేవతాయుక్తా షాడ్గుణ్యపరిపూరితా ॥ 84 ॥ 🍀


🌻 386. 'షడంగ దేవతాయుక్తా' - 1🌻


షడంగ దేవతలతో కూడి యున్నది శ్రీదేవి అని అర్థము. షడంగ దేవత లనగా ఆరు అంగముల దేవతలు. ఆరు అంగములు వరుసగా యిట్లున్నవి. 1. హృదయము, 2. శిరస్సు, 3. శిఖ, 4. నేత్రము, 5. కవచము, 6. అస్త్రములు (అనగా శక్తులు). షడంగ దేవతలకు దేవత శివుడు. అతడు పై ఆరు దేవతలపై ఈశ్వరత్వము వహించి జీవుల హృదయమున ఈశ్వరుడై వర్ధిల్లును.


అట్లు ఈశ్వరుడై హృదయమున నుండి ఆరు అంగములను ఆరు దేవతలచే నిర్వర్తింపచేయును. శ్రీమాత శివుని దేవతలను, అంగము లను నిర్వర్తింపచేయు చైతన్య స్వరూపము. ఆమెయే షడంగ దేవతలతో కలసి శివునితో కూడి సమస్తమును నిర్వర్తించును.


సశేషం... 🌹 🌹 🌹 🌹 🌹 🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 386 - 1 🌹 Contemplation of 1000 Names of Sri Lalitha Devi ✍️. Acharya Ravi Sarma 📚. Prasad Bharadwaj 🌻 84. Sadyah prasadini vishvasakshini sakshivarjita Shadanga devata yukta shadgunya paripurita ॥ 84 ॥ 🌻 🌻 386. षडङ्ग-देवदायुक्ता ṣaḍaṅga-devadāyuktā -1 🌻 ṣaḍ (six) + aṅaga (parts) means six parts. For every mantra there are six parts and each such part is under the control of a god/goddess called aṅaga devatā-s of the presiding deity. These six parts are heart, head, tuft of hair, arms, eyes and weapons. Before and after the recitation of a mantra, the deities of these parts are worshipped in our bodies by touching the respective body parts with fingers. This is with regard to the external worship. Continues... 🌹 🌹 🌹 🌹 🌹

Comentarios


Post: Blog2 Post
bottom of page