🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 388 / Sri Lalitha Chaitanya Vijnanam - 388🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 85. నిత్యక్లిన్నా, నిరుపమా, నిర్వాణ సుఖదాయినీ ।
నిత్యా, షోడశికారూపా, శ్రీకంఠార్ధ శరీరిణీ ॥ 85 ॥ 🍀
🌻 388. ‘నిత్యక్లిన్నా'🌻
నిత్యము దయతో నుండునది శ్రీదేవి అని అర్థము. దయ, కరుణ, ప్రేమ, ఆత్మీయత, జాలి, క్షమ ఇత్యాది హృద్యమగు గుణములు కలిగినది శ్రీమాత. నిజమునకు శ్రీమాత స్థానము హృదయమే. ఆమె హృదయముతోనే సర్వమును పాలించును. హృదయములో గెలువ గలిగిననాడు జీవుడు రాజును మించిన వాడగును. రారాజు హృదయ మెరిగినవాడే. హృదయముతో జయించ గలిగినది, శక్తితో జయించలేము. శక్తిని కూడ హృదయముతో జయించ వచ్చును.
ఋషులలో బ్రహ్మర్షి అయిన వశిష్ఠు డట్టివాడు. వశిష్ఠ మహర్షి హృదయ తత్త్వముతో నిండి సర్వమును జయించెను. హృదయమునకున్న స్వామిత్వము మరి ఏ కేంద్రమునకును లేదు. “ఓ అర్జునా! నేను జీవుల హృదయము నందుండి వారిపై ఈశ్వరత్వము నిలుపుచున్నాను.” అని శ్రీకృష్ణుడు పలికెను. సత్త్వమునకు, సత్యమునకు హృదయమే కేంద్రము. శ్రీమాత నిత్యము హృదయ మందుండి భక్తులకు భుక్తి, ముక్తి నిచ్చుచు ప్రేమతో పరిరక్షించుచు నుండును. కనుకనే ఆమె 'నిత్యక్లిన్న'.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 388 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 85. Nityaklinna nirupama nirvana sukhadaeini
Nitya shodashika rupa shree kantardha sharirini ॥ 85 ॥ 🌻
🌻 388. Nitya-klinnā नित्य-क्लिन्ना 🌻
Her ever compassionate nature is referred here. This is an extension of nāma 326. karuṇā-rasa-sāgarā. Nitya-klinnā is the name of a tithi nityā devi (third day of the lunar fortnight).
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Comentarios