top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 391 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 391 - 1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 391 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 391 - 1🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 85. నిత్యక్లిన్నా, నిరుపమా, నిర్వాణ సుఖదాయినీ ।

నిత్యా, షోడశికారూపా, శ్రీకంఠార్ధ శరీరిణీ ॥ 85 ॥ 🍀


🌻 391. 'నిత్యా షోడశికారూపా' - 1 🌻


పదునారు దేవతల రూపమున భాసించెడిది శ్రీమాత అని అర్థము. కామేశ్వరి మొదలు త్రిపురసుందరి వరకు గల పదహారు దేవతలు నిత్యాదేవత లని పిలువబడుదురు. పదిహేను అంగములుగ పదిహేను దేవతలును, వాటికి మూలముగ శ్రీమాత పదహారవదిగా వెలుగొందు చుండును. నిత్యము అట్లే వెలుగొందు చుండును.


'నిత్య' అనగా శాశ్వతమైనది. వికల్పము లేనిది. ఈ పదహారు దేవతలును, పదహారు కళలుగ చంద్రుని నుండి తిథులద్వారా మనలను అనుగ్రహించు చుందురు. అమావాస్య నుండి పౌర్ణమి అంతము వరకు గల తిథులు పదహారు. పదహారు తిథుల యందు వ్యక్తావక్త స్వరూపిణి యగు శ్రీమాత పూర్ణమే అయిననూ చూచువారిని బట్టి వెలుగు నీడలు ఉన్నట్లు గోచరించును. చంద్రుడు వెలుగు భాగము వ్యక్త స్వరూపము. వెలగని భాగము అవ్యక్త స్వరూపము.


సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 391 - 1 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️. Acharya Ravi Sarma

📚. Prasad Bharadwaj


🌻 85. Nityaklinna nirupama nirvana sukhadaeini

Nitya shodashika rupa shree kantardha sharirini ॥ 85 ॥ 🌻


🌻 391. Nityā-ṣoḍaśikā-rūpā नित्या-षोडशिका-रूपा -1 🌻


This is a reference to the sixteen deities representing sixteen lunar days and they are worshipped in Śrī Cakra. The sixteenth deity is Lalitāmbikā Herself. These fifteen deities are said to represent fifteen bīja-s of Pañcadaśī mantra and Lalitāmbikā as the sixteenth deity representing ṣodaśī mantra. ṣodaśī mantra has sixteen bīja-s, the additional bīja being श्रीं (śrīṁ), the Lakṣmī bīja. ṣodaśī mantra is considered as the most powerful mantra of all. This is the mantra meant only for the final liberation.


ṣodaśī also refers to a type of sacrifice called agniṣṭoma, a fire ritual where the performer maintains the sacred fire, the offering is the Soma, the deities to whom, the offering is made are Indra and other gods. The number of priests required is sixteen, the ceremonies continue for five days. This is based on strange mantra-s, full of interpolations, which are not found in Rig Veda, though they are referred in Śrautra Sūtra-s and Brāhmaṇa-s of Rig Veda and also occur in Sāma Veda and Atharva Veda. Both chants and recitations are complex and are considered particularly sacred and powerful.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹


Comments


Post: Blog2 Post
bottom of page