top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 393 / Sri Lalitha Chaitanya Vijnanam - 393


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 393 / Sri Lalitha Chaitanya Vijnanam - 393🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 86. ప్రభావతీ, ప్రభారూపా, ప్రసిద్ధా, పరమేశ్వరీ ।

మూలప్రకృతి రవ్యక్తా, వ్యక్తాఽవ్యక్త స్వరూపిణీ ॥ 86 ॥ 🍀


🌻 393. 'ప్రభావతీ' 🌻


కాంతి కలది శ్రీమాత అని అర్ధము. కాంతి శ్రీమాత సహజ గుణము. ఆమెయే సృష్టి వెలుగు. ఆ వెలుగు ఆధారముగనే సృష్టి వైభవ మంతయూ యేర్పడు చున్నది. ఆ వెలుగు యందు వేడిమి యున్నది. అది ఆమె తేజస్సు. అందు అందము కూడ యున్నది. వెలుగుల అందము సామాన్యులను కూడ ఆకర్షితులను చేయును. శ్రీమాత వెలుగు మిట్ట మధ్యాహ్నపు వెలుగు వలె నుండును. ఉభయ సంధ్యల యందలి వెలుగు కూడ శ్రీమాతయే.


సూర్యుని యందు వెలుగు, చంద్రుని యందలి వెలుగు, అగ్ని యందలి తేజస్సు శ్రీమాతయే. సమస్తమును వెలిగించునది ఆమెయే. సృష్టి యజ్ఞమునకు ఆమెయే వెండితెర. వెండితెర ఆధారముగనే సృష్టి చిత్రము ప్రదర్శింపబడు చున్నది. చూచువారి చూపు యందలి వెలుగు కూడ ఆమెయే. కరణముల యందలి ప్రకాశము కూడ ఆమెయే. ఎక్కడ ప్రకాశ మున్నదో అక్కడ శ్రీమాత యున్నది. ఆమె ప్రకాశ గుణము ద్రవ్యమయము కాదు. ద్రవ్యముపై ఆమె గుణము ప్రసరించినపుడు ఆయా ద్రవ్యములు వెలుగు చుండును.


సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 393 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️. Acharya Ravi Sarma 📚. Prasad Bharadwaj


🌻 86. Prabhavati prabha rupa prasidha parameshari

Mulaprakruti ravyakta vyaktavyakta svarupini ॥ 86 ॥ 🌻


🌻 393. Prabhāvatī प्रभावती🌻


She is endowed with the power of effulgence. She is surrounded by eight devi-s each representing one of the aṣṭama siddhi-s. They are very powerful and illuminant and known as aṇimā, laghimā, mahimā, īśitva, vaśitva, prākāmya, prāpti and sarvakāma. These eight devi-s are called prabha. Prabhāvatī is the One who is surrounded by prabha-s.


Saundarya Laharī (verse 30) says, “What wonder is there in ārati to the one who constantly meditates on you, surrounded by rays emanating from your feet as aṇimā and others...”



Continues...


🌹 🌹 🌹 🌹 🌹


ความคิดเห็น


Post: Blog2 Post
bottom of page