🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 398 / Sri Lalitha Chaitanya Vijnanam - 398🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 86. ప్రభావతీ, ప్రభారూపా, ప్రసిద్ధా, పరమేశ్వరీ ।
మూలప్రకృతి రవ్యక్తా, వ్యక్తాఽవ్యక్త స్వరూపిణీ ॥ 86 ॥ 🍀
🌻 398. 'అవ్యక్తా’🌻
గ్రహింపబడనిది, వర్ణింపలేనిది, తపస్సుచే గాని, కర్మచే గాని పొందరానిది శ్రీమాత అని అర్ధము. మూల ప్రకృతి నుండి మొదటి ఆవరణగా వెలువడునది అవ్యక్తము. మాయ యొక్క ప్రకాశ రూపము గలది. ఈ అవ్యక్తము సృష్టి ధర్మము కలిగి యుండును. సూక్ష్మతమమై యుండును. చక్రము లేనిదై యుండును. దీనికి ఆది గాని, అంతము గాని, చేతన గాని లేదు.
విశ్వవ్యాప్తమై నిలచి యుండును. మహత్తున కవ్వలిదై యుండును. మూడు గుణముల సమష్టి రూపముగ యుండును. మూల ప్రకృతి నుండి యేర్పడును. ఈ అవ్యక్త మాధారముగనే వ్యక్తమగు మహతత్త్వము పుట్టును. అవ్యక్తమే వ్యక్త మగుటచేత తర్వాత నామమున 'వ్యక్తా అవ్యక్త స్వరూపిణి' అని కీర్తింపబడినది.
సశేషం... 🌹 🌹 🌹 🌹 🌹 🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 398 🌹 Contemplation of 1000 Names of Sri Lalitha Devi ✍️. Acharya Ravi Sarma 📚. Prasad Bharadwaj 🌻 86. Prabhavati prabha rupa prasidha parameshari Mulaprakruti ravyakta vyaktavyakta svarupini ॥ 86 ॥ 🌻 🌻 398. Avyaktā अव्यक्ता 🌻 This could be considered as further extension of the previous nāma. Avyakta is the state of prakṛti in its un-manifested form, with the three guṇa-s in equal proportions. Avyakta is the first stage of the Brahman that cannot be explained, as this is the purest form of Brahman, without parentage. This stage is also known as turya or the fourth state of consciousness, the other three being sleep, dream and deep sleep. It is the non-dualistic state, where the Brahman without a second is realized. This stage is explained by Brahma Sūtra (III.ii.23) which says tadvyaktamāha hi (तद्व्यक्तमाह हि). This means “That Brahman is un-manifest”. This is further explained as ‘It is not comprehended through the eye, or through speech, or through other senses. Nor it is attained through austerity or karma. It is imperceptible, for It is never perceived’. When the nirguṇa Brahman (the Brahman without attributes) desires to create, the māyā undergoes modifications and this modified stage of māyā is called avyakta. Continues... 🌹 🌹 🌹 🌹 🌹
Comments