top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 401 / Sri Lalitha Chaitanya Vijnanam - 401


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 401 / Sri Lalitha Chaitanya Vijnanam - 401 🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురుVijnanam Main Category లలితా చైతన్య విజ్ఞానము మైత్రేయ మహర్షి బోధనలు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 87. వ్యాపినీ, వివిధాకారా, విద్యాఽవిద్యా స్వరూపిణీ ।

మహాకామేశ నయనా కుముదాహ్లాద కౌముదీ ॥ 87 ॥ 🍀


🌻 401. 'వివిధాకారా’ 🌻


ప్రాకృత సర్గము, వైకృత సర్గము, కౌమార సర్గము అను వివిధ ఆకారములు కలది శ్రీమాత అని అర్థము. మహదహంకారము నుండి సాత్విక, రాజస, తామస అహంకారము లేర్పడుచున్నవి. వానినుండి తైజస, వైకారిక, భూతాది ప్రకృతి ప్రకాశించును. తైజసము నుండి మనస్సు, వైకారికము నుండి ఇంద్రియములు, భూతాది నుండి తన్మాత్రలు పుట్టినవి. ఈ మొత్తము ఆరు సర్గలు మహత్తు నుండి జరిగినవి. వీటిని ప్రాకృత సర్గము లందురు. వీనినుండి వృక్షములు, పశువులు, ఇతర భూతములు పుట్టినవి. వీటిని వైకృత సర్గము లందురు.


ప్రాకృతము, వైకృతాకృతము అయిన ఒక సృష్టిని కౌమార సర్గము అని చెప్పిరి. ఇందు మొదటి సర్గము మహత్తు, రెండవది అహంకారము, మూడవది భూతము. మహత్తు నుండి గుణములు, అహంకారము నుండి ద్రవ్యజ్ఞాన క్రియలు, భూత సర్గము నుండి ద్రవ్యశక్తి పుట్టినవి. వీని వివరములు భాగవతము రెండవ అధ్యాయమున బ్రహ్మదేవుడు నారదునకు తెలిపిన ఉపదేశమున చూడవచ్చును.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 401 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️. Acharya Ravi Sarma 📚. Prasad Bharadwaj


🌻 87. Vyapini vividhakara vidya vidya svarupini

Mahakameshanayana kumudahlada kaomudi ॥ 87 ॥ 🌻


🌻 401. Vividhākārā विविधाकारा 🌻


She has many forms. All these forms arise out of mūla-prakṛti (nāma 397). She takes different forms while performing different functions. As the creator, She is the Supreme Mother or Brahma rūpa (nāma 265). As the sustainer, She is Viṣṇu rūpinī (nāma 893). As the destroyer, She is Rudra rūpā (nāma 269). As a witness to the total dissolution, She is mahā pralaya sākṣiṇī (nāma 571).


This nāma encases all Her forms. As seen above, each of Her acts is represented by a form. She is also addressed as bahu-rūpā in nāma 824.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹



Comments


Post: Blog2 Post
bottom of page