top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 403 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 403 - 1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 403 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 403 - 1 🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 87. వ్యాపినీ, వివిధాకారా, విద్యాఽవిద్యా స్వరూపిణీ ।

మహాకామేశ నయనా కుముదాహ్లాద కౌముదీ ॥ 87 ॥ 🍀


🌻 403. 'మహాకామేశ నయనా కుముదాహ్లాద కౌముదీ ' - 1 🌻


మహాకామేశ్వరుని అర్ధ నిమీలిత నేత్రములకు ఆహ్లాదము కలిగించు వెన్నెల వంటిది శ్రీమాత అని అర్థము. మహాకామేశుడు నిర్లిప్త భావమునకు అధిపతి. అతడు సతత సంతుష్టి, నిత్య తపస్వి. సృష్టికార్యములకై అతనిని ఉన్ముఖము గావించ గలిగిన ఆహ్లాద స్వరూపిణి శ్రీమాతయే. పరముతో ఏకత్వము చెంది యుండు ఈశ్వరుని కామేశునిగా చేయుట సాధ్యమా!


పరమునందు ఆసక్తి గలవానిని ఇచ్ఛకు ఉన్ముఖుని చేయుట ఎవరి వశము కాదు. అట్టి పరమేశ్వరుని మెప్పించి కామేశ్వరునిగ సృష్టి కార్యమునకు ఉన్ముఖము గావించిన శ్రీదేవి ఎంతటి వెన్నెల! అతడు అగ్ని స్వరూపుడు. ఆమె వెన్నెల స్వరూపిణి. ఆ వెన్నెల ఎట్టిది? ఎఱ్ఱని కమలములను కూడ వికసింపచేయగల వెన్నెల. చల్లని వెన్నెల. కార్తీక పౌర్ణమినాటి వెన్నెల ఆహ్లాదమగు శీతలమును కలిగించు వెన్నెల. ఆ వెన్నెలకు ఎఱ్ఱని కమలములు కూడ విచ్చుకొనును.


సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 403 - 1 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️. Acharya Ravi Sarma 📚. Prasad Bharadwaj


🌻 87. Vyapini vividhakara vidya vidya svarupini

Mahakameshanayana kumudahlada kaomudi ॥ 87 ॥ 🌻


🌻 403. 'Mahakamesha Nayana Kumudahlada Kaumudi' - 1 🌻


It means that Srimata is like the moon that delights the precious eyes of Mahakameswara. Mahakamesha is the ruler of the detached mind. He is eternally content and eternally penitent. It was Sri Mata who makes him enthusiastic about creation. Is it possible to make Ishwar, the eternal renunciate, as Kamesh, the lord of creation.


It is not easily possible for anyone to make one vested only in the Divine, oriented towards desire. How graceful light is Sridevi! for she turned the ever renunciate Parameshwar into the lord of desire, Kameshwar for the act of Creation! He is the embodiment of fire. She is the embodiment of the moonlight. How is that moonlight? A light that can make even red lotuses bloom. Cold light. A pleasant winter moonlight . For that light, red lotuses also bloom.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹


コメント


Post: Blog2 Post
bottom of page