top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 403 - 6 / Sri Lalitha Chaitanya Vijnanam - 403 - 6


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 403 - 6 / Sri Lalitha Chaitanya Vijnanam - 403 - 6🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 87. వ్యాపినీ, వివిధాకారా, విద్యాఽవిద్యా స్వరూపిణీ ।

మహాకామేశ నయనా కుముదాహ్లాద కౌముదీ ॥ 87 ॥ 🍀


🌻 403. 'మహాకామేశ నయనా కుముదాహ్లాద కౌముదీ ' - 6 🌻


'కుముద' అను పదమునకు కూడ మరియొక అర్థ మున్నది. 'ముద' అనగా మోదము. కుముద అనగా హరింపబడిన మోదము. దుఃఖము కారణముగ మోదము హరింపబడును. దుఃఖితులైన భక్తులు కుముదములవంటి వారు. వారికి ఆహ్లాదము కలిగించి మహా కామేశుని వద్దకు దివ్యకాంతుల మార్గమున శ్రీమాత గొనిపోవునని ఈ నామార్ధము.


సంసారబద్ధులైన భక్తులకు ఈ అర్థము సమంజసమై యున్నది. భక్తుల దుఃఖములను పోగొట్టి ఆహ్లాదమును కూర్చి దివ్య మార్గమున గొనిపోయి పరమశివుని చెంతకు చేర్చు శ్రీమాతను ఎంత శ్లాఘించిననూ అల్పమే.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 403 - 6 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️. Acharya Ravi Sarma 📚. Prasad Bharadwaj


🌻 87. Vyapini vividhakara vidya vidya svarupini

Mahakameshanayana kumudahlada kaomudi ॥ 87 ॥ 🌻


🌻 403. 'Mahakamesha Nayana Kumudahlada Kaumudi' - 6 🌻


The word 'Kumuda' also has another meaning. 'Muda' means bliss. Kumuda means drained bliss, meaning sorrow. Sadness is the cause of sorrow. Sorrowful devotees have their bliss drained from them. Srimata, by reinvigorating bliss in them, shall take those devotees on the path of light to the Lord Shiva.


This meaning seems reasonable for the uncelibate devotees. It is not enough to praise Sri Mata who removes the sorrows of the devotees and gathers happiness and leads them on the divine path and brings them to the side of Lord Shiva.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹


Comments


Post: Blog2 Post
bottom of page