top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 405 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 405 - 1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 405 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 405 - 1🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 88. భక్తహార్ద తమోభేద భానుమద్-భానుసంతతిః ।

శివదూతీ, శివారాధ్యా, శివమూర్తి, శ్శివంకరీ ॥ 88 ॥ 🍀


🌻 405. 'శివదూతీ' - 1 🌻


శివుని దూతగా పంపునది శ్రీదేవి అని అర్థము. శివుడనగా శుభము. శ్రీమాత దర్శన మిచ్చుటకు ముందుగా శుభములు కలిగించును. శుభములను కూర్చి అటుపై దర్శనమిచ్చుట శ్రీమాత లక్షణము. శుభములు కలిగించుటకు ముందు కూడా శుభ శకునములను పంపును. శుభ శకునములన్నియూ రాబోవు శుభములను తెలియజేయు సంకేతములే. పురుషులకు కుడి కన్ను అదురుట, కుడి భుజము అదురుట, స్త్రీలకు ఎడమ కన్ను అదురుట, ఎడమ భుజము అదురుట శుభ సంకేతములే.


సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹



🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 405 - 1 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️. Acharya Ravi Sarma 📚. Prasad Bharadwaj


🌻 88. Bhaktahardhatamobheda bhanumadbanu santatih

Shivaduti shivaradhya shivamurtishivankari ॥ 88 ॥ 🌻


🌻 405. 'Shivadhooti' - 1 🌻


It means that Lord Shiva is the messenger of Sridevi. Shiva means auspices. Shrimata brings auspiciousness before giving her darshan. Sri Mata's characteristic is to give auspicious things first and give darshan later. She sends auspicious omens even before giving auspiciousness. All omens are signs of good things to come. Twitching of right eye and right shoulder for men, left eye and left shoulder for women are auspicious signs.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹

留言


Post: Blog2 Post
bottom of page