top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 409 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 409 - 1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 409 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 409 - 1🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 89. శివప్రియా, శివపరా, శిష్టేష్టా, శిష్టపూజితా ।

అప్రమేయా, స్వప్రకాశా, మనోవాచామ గోచరా ॥ 89 ॥ 🍀


🌻 409. ‘శివప్రియా'- 1 🌻


శివునకు ప్రియురాలు శ్రీమాత అని అర్ధము. శివుడు ప్రియుడుగా నుండునది శ్రీమాత అని అర్థము. శివునికి శ్రీమాత ప్రియురాలు. శ్రీమాతకు శివుడు ప్రియుడు. ఒకరి యందు ఒకరికి ప్రియత్వము సమానముగ నున్న స్థితి ఇది. ఇట్టి సమానత్వము అరుదు. దంపతీయం దిట్టి ప్రియత్వము సామాన్యముగ కానరాదు. సమాన ప్రియత్వమునకు శివపార్వతులే ప్రమాణము. వారితో పోల్చదగిన వారు సీతారాములు. వీరినే ఆదర్శ దంపతులని మన సంప్రదాయము కొనియాడుచున్నది. దంపతి యందు ప్రియత్వమున హెచ్చుతగ్గులు సామాన్యము. కొన్ని సమయములందు పురుషుడు ఆధిక్యము చూపుట, అట్లే మరికొన్ని సమయములందు స్త్రీలు ఆధిక్యము చూపుట కనబడును. ప్రేమ యున్నచోట ఆధిక్యముండదు.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 409 - 1 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️. Acharya Ravi Sarma 📚. Prasad Bharadwaj


🌻 89. Shivapriya shivapara shishteshta shishta-pujita

Aprameya svaprakasha manovachamagochara ॥ 89 ॥ 🌻


🌻 409. 'Shivapriya'- 1 🌻


It means Srimata is the beloved of Lord Shiva. It also means Srimata's beloved is Lord Shiva. Srimata is dear to Lord Shiva. Lord Shiva is dear to Srimata. This is the state of equal love for each other. Such equality is rare. It is rare to see such love in marriage. Shiva Parvati is the standard for equality in love. Comparable to them are the Sita and Rama. Our tradition praises them as ideal couple. Inequalities are common in marriage. At some times the husband is seen to be dominant and at other times the wife is seen to be dominant. Where there is love there is no superiority.


Continues...


🌹 🌹 🌹 🌹 🌹

Comentários


Post: Blog2 Post
bottom of page