🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 409 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 409 - 2🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 89. శివప్రియా, శివపరా, శిష్టేష్టా, శిష్టపూజితా ।
అప్రమేయా, స్వప్రకాశా, మనోవాచామ గోచరా ॥ 89 ॥ 🍀
🌻 409. ‘శివప్రియా'- 2 🌻
ప్రేమ సమానత్వమునకు నిదర్శనము. ఆధిక్యము హెచ్చుతగ్గులకు నిదర్శనము. పురుషులు తాము అధికులను కొందురు. అట్టి పురుషులు తెలియని వారు. అట్లే స్త్రీలు కూడ తాము అధికులమని ఋజువు చేయుటకు ప్రయత్నింతురు. ఇరువురు సమానులే గాని ఎవరునూ ఒకరి కన్న ఇంకొకరు అధికులు కారు. ఆధిక్య భావము అజ్ఞానము, సమభావము జ్ఞానము. సమదర్శనులే తెలిసినవారని శ్రీకృష్ణుడు గీతయందు తెలిపెను. సమదర్శనము లేనిచోట దివ్యసాన్నిధ్య ముండదు. శివప్రియా అను నామము ఇట్టి సమభావమును ప్రకటించుచున్నది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 409 - 2 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️. Acharya Ravi Sarma 📚. Prasad Bharadwaj
🌻 89. Shivapriya shivapara shishteshta shishta-pujita
Aprameya svaprakasha manovachamagochara ॥ 89 ॥ 🌻
🌻 409. 'Shivapriya'- 2 🌻
Love is proof of equality. Dominance is indicative of inequality. Men tend to think they are superior. Such men are ignorants. Similarly, women also try to prove that they are superior. Both are equal and neither is superior to the other. Superiority is ignorance, equality is wisdom. Lord Krishna said in the Gita that only those who envision equality are wise. Where there is no equality in outlook, there is no reaching Divine. The name Shivapriya declares this equality.
Continues... 🌹 🌹 🌹 🌹 🌹
Comments