top of page
Writer's picturePrasad Bharadwaj

శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 410 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 410 - 2


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 410 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 410 - 2🌹


🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻


✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్


సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 89. శివప్రియా, శివపరా, శిష్టేష్టా, శిష్టపూజితా ।

అప్రమేయా, స్వప్రకాశా, మనోవాచామ గోచరా ॥ 89 ॥ 🍀


🌻 410. 'శివపరా'- 2 🌻


ప్రకృతి పురుషులలో ఇట్టి అవినాభావ అభేద స్థితి సతతముండును. ఇట్లు ఒకరి నొకరు మన్నించుకొనుట సృష్టియందు వీరిరువురి నుండియే ప్రారంభమైనది. భక్తుడు, భగవంతుడి నడుమ కూడ ఇట్టి అభేద స్థితి యున్నది. గురుశిష్యుల సంబంధముకూడ అట్టిదే. గోచరించుటకు ఒకటి కన్న ఎక్కువగా వున్ననూ ఇరువురి నుండి వ్యక్తమగు తత్త్వ మొక్కటియే. రామనామము చేయువానిని హనుమంతుడు అనుగ్రహించును. హనుమంతుని ఆరాధించువానిని రాము డనుగ్రహించును. నందీశ్వరుని గౌరవించినచో శివుడనుగ్రహించును. శివుని ప్రార్థించినచో నందీశ్వరుడు సహకరించును.



సశేషం...


🌹 🌹 🌹 🌹 🌹





🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 410 - 2 🌹


Contemplation of 1000 Names of Sri Lalitha Devi


✍️. Acharya Ravi Sarma 📚. Prasad Bharadwaj


🌻 89. Shivapriya shivapara shishteshta shishta-pujita

Aprameya svaprakasha manovachamagochara ॥ 89 ॥ 🌻


🌻 410. 'Shivapara'- 2 🌻


In between nature and consciousness, this state of imperishable oneness is eternal. This feeling of oneness in creation originated from Srimata and Lord Shiva. The devotee and the Lord are also in this state of oneness. The same is with the relationship between Guru and His disciples. Eventhough they are more than one, there is oneness in the philosophy they are expressing. Lord Hanuman blesses the one who chants Ram Naam. Rama blesses the worshiper of Hanuman. If you respect Nandiswara, Shiva will bless you. If you pray to Lord Shiva, Nandiswara will help you.



Continues...


🌹 🌹 🌹 🌹 🌹

Comments


Post: Blog2 Post
bottom of page