🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 411 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 411 - 1🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 89. శివప్రియా, శివపరా, శిష్టేష్టా, శిష్టపూజితా ।
అప్రమేయా, స్వప్రకాశా, మనోవాచామ గోచరా ॥ 89 ॥ 🍀
🌻 411. 'శిష్టేష్టా’- 1 🌻
శిష్టుల యందు ప్రియత్వము కలది శ్రీమాత అని అర్థము. ధర్మబుద్ధి గలవారు శిష్టులు. ధర్మము నాచరించుట శిష్టాచారము. ఆచారము నుండే ధర్మము వ్యక్తమగు చుండును. సదాచారము ధర్మమును పుట్టించును. ధర్మము సదాచారమును కాపాడుచుండును. అట్టి ధర్మమును బోధించువాడు గురువు, పాలించు వాడు ప్రభువు. విష్ణువు ప్రభువు. శివుడు గురువు. ఒకరు ధర్మమును బోధింపగ మరియొకరు ధర్మమును పాలింతురు.
ధర్మ స్వరూపము ఆత్మసాక్షిగ ప్రతి వ్యక్తియందు వుండును. ఆత్మావలోకనము, ఆత్మ పరిశీలనము ప్రతినిత్యము చేసుకొనువారికి లోనుండియే తప్పొప్పులు తెలియ బడును. అట్టివారు కర్మాచరణమున ధర్మము నందు చపలత్వము లేక ప్రవర్తింతురు. ధర్మము నందే యుండుటకు ప్రయత్నింతురు, ప్రార్థింతురు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 411 - 1 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️. Acharya Ravi Sarma 📚. Prasad Bharadwaj
🌻 89. Shivapriya shivapara shishteshta shishta-pujita
Aprameya svaprakasha manovachamagochara ॥ 89 ॥ 🌻
🌻 411. 'Sishteshta'- 1 🌻
It means Shree Mata who is loved by the pious. Pious are the righteous. To practice righteousness is being pious. Virtue manifests itself from ritual. A pious ritual brings about dharma. Dharma preserves and protects the ritual. The one who teaches such dharma is the Guru, and the one who governs it is the Lord. Vishnu is the Lord and Shiva is the teacher. One teaches the Dharma and the other governs it.
The embodiment of Dharma is present in every self-conscious person. Those who do introspection and self-examination will know their mistakes from within. So they shall not behave with carelessness in following dharma. They try and pray to be righteous.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Commentaires